సిల్క్ స్మిత గురించి బాలయ్య కామెంట్స్

Thu Jul 22 2021 07:00:02 GMT+0530 (IST)

Balakrishna Comments About Silk Smita?

నందమూరి బాలకృష్ణ చాలా బోల్డ్ గా మాట్లాడేస్తారు. ఆయన ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఏదో ఒక విషయమై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఆయన బోల్డ్ గా మాట్లాడే మాటలే వివాదాస్పదం అవుతూ ఉంటాయి. ఇటీవల ఆయన మా ఎన్నికలు మరియు భవనం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.తాజాగా మరోసారి ఆయన మాట్లాడుతూ సీనియర్ హీరోయిన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య 369 సినిమా మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మీడియాతో ముచ్చటించారు. ఆ సందర్బంగా సినిమాలో నటించిన హీరోయిన్ మోహిని మరియు కీలక పాత్రలో నటించడంతో పాటు జానవులే పాటలో కనిపించిన సిల్క్ స్మిత గురించి మాట్లాడాడు.

ఆదిత్య 369 సినిమాకు ముందు సిల్క్ స్మిత కు ఒక రకమైన ఇమేజ్ ఉండేది. ఆ సినిమా తర్వాత ఆమె ఒక మంచి నటిగా గుర్తింపు దక్కించుకుంది. నటిగా అవకాశం వస్తే తను చెలరేగి పోతాను అంటూ చెప్పేది. అన్నట్లుగానే మా సినిమా తో మంచి నటిగా ఆమె గుర్తింపు దక్కించుకుంది.

నటిగా ఆమెకు ఆ తర్వాత ఎన్నో ఆఫర్లు వచ్చాయి. అప్పట్లో ఆమె మేకప్ గురించి టాప్ స్టార్ హీరోయిన్స్ కూడా ఎంక్వౌరీ చేసేవారు. ఆమె మేకప్ విషయంలో తీసుకునే జాగ్రత్తల గురించి కూడా అందరు చర్చించుకునే వారు అంటూ బాలయ్య అన్నాడు.

ఇక ఆ సినిమా లో నటించిన మోహిని షూటింగ్ గ్యాప్ లో పుస్తకాలు చదువుతూ కనిపించేది. ఆమె చదువుతున్నది ఏదో నవల అనుకునేవాడిని. కాని ఆమె ఆ సమయంలో 9వ తరగతి చదువుతుంది. నేను ఎన్నో సారి 9వ తరగతి అంటూ ఆట పట్టించేవాడిని.

ఇక శ్రీదేవి మరియు మాధురీ దీక్షిత్ వంటి స్టార్ కూడా ఒకప్పుడు డాన్స్ నేర్చుకునేందుకు కుస్తీ పట్టేవారు. నాన్న గారు వీపు మీద గుద్ది.. నడుముపై పిర్రలపై కొట్టి మరీ వారికి డాన్స్ నేర్పించేవారు. వాళ్లు సుకుమారంగా డాన్స్ చేస్తే.. నాన్నగారు వారి కాళ్లు తొక్కి మరీ మాస్ స్టెప్పులు వేయించేవాడు అంటూ బాలయ్య కామెంట్స్ చేశాడు.