Begin typing your search above and press return to search.

వ‌చ్చే వారం నుంచి న‌ట‌సింహం బ‌రిలోకి!

By:  Tupaki Desk   |   1 July 2022 6:30 AM GMT
వ‌చ్చే వారం నుంచి న‌ట‌సింహం బ‌రిలోకి!
X
ఇటీవ‌ల న‌ట‌సింహ బాల‌కృష్ణ కోవిడ్ బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. మూడు డోసుల వ్యాక్సినేష‌న్ పూర్త‌యినా బాల‌య్య క‌రోనా బారిన ప‌డ‌టంతో  అభిమానులు కాస్త  కంగారు ప‌డ్డారు. కానీ బాల‌య్య వేగంగానే కోలుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంది. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం బాల‌య్య సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు.

కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.  మ‌రోసారి కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా నెగిటివ్ రిపోర్ట్  వ‌చ్చింది. డాక్ట‌ర్లు యధావిధిగా త‌న ప‌నులు తాను చేసుకోవ‌చ్చ‌ని...స్వేచ్చ‌గా బ‌య‌ట‌కు తిర‌గొచ్చ‌ని సూచించ‌డంతో న‌ట‌సింహం షూటింగ్ కి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న క‌థానాయ‌కుడిగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి  తెలిసిందే.

దాదాపు షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. బాల‌య్య‌పై మెజర్టీ పార్ట్ షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. చివ‌రి షెడ్యూల్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. ఇంత‌లో వైర‌స్ బారిన ప‌డ‌టంతో ఆ షెడ్యూల్ వాయిదా ప‌డింది. తాజాగా బాల‌య్య కోలుకోవ‌డంతో ఆ షెడ్యూల్ కి రంగం సిద్దం చేస్తోంది యూనిట్. వ‌చ్చే వారం  హైద‌రాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుంద‌ని స‌మాచారం.

బాల‌కృష్ణ ఈ షెడ్యూల్ లో యధావిధిగా పాల్గొంటార‌ని తెలుస్తోంది. బాల‌య్య‌తో పాటు.. ఇత‌ర తారాగాణంపై కీల‌క స‌న్నివేశాలు  చిత్రీక‌రించ‌నున్నారని స‌మాచారం. యూనిట్ స‌మాచారం ప్ర‌కారం కొన్ని భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు ఈ షెడ్యూల్ లో చిత్రీక‌రించ‌నున్నార‌ని  తెలిసింది. క్లైమాక్స్ లో భాగంగా వ‌చ్చే స‌న్నివేశాలు కొన్ని బ్యాలెన్స్ ఉండ‌టంతో వాటిని ఇప్పుడు పూర్తిచేసే ప్ర‌క్రియ‌లో భాగంగా టీమ్ ముందుకు క‌దులుతున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే బాల‌య్య ఈ స‌న్నివేశాల విష‌యంలో ఎంత వ‌ర‌కూ స‌హ‌క‌రించ‌గ‌ల‌రు? అన్న‌ది ఆలోచించాల్సిన విష‌యం. ఇప్పుడిప్పుడే కోవిడ్ నుంచి కోలుకుంటున్నారు. మునుప‌టి అంత ఉత్సాహం..ఎన‌ర్జీని సె ట్ లో చూపించ‌గ‌ల‌రా? అన్నది మ‌రో సందేహంగా తెర‌పైకి వ‌స్తోంది.  కొన్ని వాస్త‌వ స‌ఘ‌ట‌న‌ల‌తో ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తున్నారు.

ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్  ఎంట‌ర్ టైన‌ర్.  భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు..మ‌సాలా స‌న్నివేశాలు త‌ప్ప‌నిస‌రి. బాల‌య్య మాస్ ఇమేజ్ కి ఏమాత్రం  త‌గ్గ‌ని సినిమాగా ఉంటుంద‌ని చెప్పాల్సిన ప‌నిలేదు. గోపీచంద్ పాత సినిమాలు చూస్తే ఆవిష‌యం ఈజీగా అర్ధ‌మ‌వుతుంది. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌నిచేస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన 'అఖండ' సినిమాకి కూడా థ‌మ‌న్ బాణీలు స‌మ‌కూర్చిన సంగ‌తి తెలిసిందే. 'అఖండ' బీజీఎమ్ కి  థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లాయి. మ‌రి ఈసారి ఇంకే స్థాయిలో ఉంటుందో చూడాలి.