Begin typing your search above and press return to search.

బాల‌య్య ర‌చ్చో ర‌చ్చ‌స్య ర‌చ్చ‌భ్యోః

By:  Tupaki Desk   |   15 Dec 2019 5:49 AM GMT
బాల‌య్య ర‌చ్చో ర‌చ్చ‌స్య ర‌చ్చ‌భ్యోః
X
స్టార్ల‌ కోసం అభిమానులు ర‌చ్చ చేయ‌డం చూశాం. కానీ అదే స్టార్ హీరో తానే అభిమానిగా మారి ర‌చ్చ చేస్తే..?! అలాంటి అరుదైన దృశ్య‌మే సాక్షాత్క‌రించింది విశాఖ ఎంజీఎం గ్రౌండ్స్ లో. శ‌నివారం సాయంత్రం `రూల‌ర్‌` ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఇలాంటి స‌న్నివేశం చోటు చేసుకుంది. అభిమానుల కేరింత‌ల న‌డుమ‌ అట్ట‌హాసంగా జ‌రుగుతున్న ప్రీరిలీజ్ వేడుక చిత్ర‌క‌థానాయ‌కుడు బాల‌కృష్ణ‌ చేసిన ర‌చ్చ‌తో కొత్త జోష్ ని నింపుకుంది.

రూల‌ర్ వేడుక‌లో పాల్గొన్న స్టార్ హీరో బాలయ్య మునుపెన్న‌డూ లేనంత హుషారుగా క‌నిపించారు. బాల‌య్య ఎక్క‌డ వుంటే అక్క‌డ హంగామా మామూలుగా వుండ‌ద‌ని మరోసారి ప్రూవైంది. రూల‌ర్ వేడుక ఆద్యంతం బాల‌య్య ఎంతో హుషారుగా క‌నిపించారు. ఇక అటు ఇటూ ఇరువురు కుర్ర భామ‌ల న‌డుమ `నారీ నారీ న‌డుమ మురారి` త‌ర‌హాలో బాల‌య్య చిలౌట్ చేసిన వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి.

ఈవెంట్ ఆద్యంతం అక్క‌డికి వ‌చ్చిన వారంద‌రితో స‌ర‌దాగా మాట్లాడేస్తూ జోష్ ని నింపిన బాల‌య్య ప్ర‌తీ ఒక్క‌రినీ ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తూ సంద‌డి చేశారు. వేదిక‌పైకి హీరోయిన్ లు వేదిక‌- సోనాల్ చౌహాన్ ని ఆహ్వానించిన ఈనే అభిమానిగా మారి ఈల‌లు వేస్టూ గోల చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ వేదికపై బాల‌య్య ప‌సిపిల్లాడు అయిపోయారు. వీల‌లు.. అరుపుల‌తో ర‌చ్చ చేశారు. తానొక వెట‌ర‌న్ స్టార్ అన్న విష‌యాన్ని కూడా ఆయ‌న ప‌ట్టించుకోలేదు. ఒకానొక పీక్ మూవ్ మెంట్ లో నోటికి రెండు చేతులు అడ్డుపెట్టుకుని అరుస్తూ బాల‌య్య ర‌చ్చ ర‌చ్చ చేశారు. అభిమానుల్లో బాల‌య్య‌లోని ఈ జోష్.. హుషారు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాల‌య్య న‌టిస్తున్న `రూల‌ర్‌` ఈ నెల 20న రిలీజ్ కాబోతోంది.

ఈ వేదిక వ‌ద్ద ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కె.ఎస్‌. ర‌వికుమార్ .. సి.క‌ల్యాణ్.. బోయ‌పాటి.. జీవిత‌-రాజ‌శేఖ‌ర్ దంప‌తులు స‌హా ప‌లువురు సినీరాజ‌కీయ ప్ర‌ముఖులు బాల‌య్య ఇచ్చిన స‌ర్ ప్రైజ్ ట్రీట్ కి ఫుల్ చిలౌట్ లోకి వెళ్లిపోయారు.