Begin typing your search above and press return to search.

ట్రెండీ స్టైలిష్ లుక్కులో బాహుబలి సుందరి.. వైరల్ పిక్!

By:  Tupaki Desk   |   7 May 2021 3:30 AM GMT
ట్రెండీ స్టైలిష్ లుక్కులో బాహుబలి సుందరి.. వైరల్ పిక్!
X
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో గ్లామర్ బ్యూటీలకు కొదవే లేదు. అందుకే ఏ భాషలో అయినా స్పెషల్ నెంబర్స్ లో ఆడిపాడే హీరోయిన్స్ స్పెషల్ గానే ఉంటారు. వాళ్లకు ఫాలోయింగ్ కూడా అలాగే ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ నోరా ఫతేహి.. గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఈ మొరాకో దేశస్థురాలు కెరీర్ ప్రారంభించింది తెలుగులోనే. 2015లో టెంపర్ సినిమా స్పెషల్ సాంగ్ తో మొదలైన నోరా హవా.. తరువాత బాహుబలి ఐటమ్ సాంగ్ మనోహరితో ప్రపంచానికి పరిచయం అయింది. వీటితో పాటు ఊపిరిలో నెమలి, కిక్-2లో టైటిల్ సాంగ్ ఇలా చాలా సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసింది. అప్పటినుండి కేవలం తెలుగు మాత్రమే కాదు. తమిళం - హిందీ సినిమాల్లో కూడా నోరా సత్తా చాటుతోంది. మాములుగా డాన్సర్ అయినటువంటి ఈ వయ్యారి.. అటు వివిధ భాషల్లో ప్రైవేట్ ఆల్బమ్స్ తో పాటు బాలీవుడ్ మూవీస్, స్పెషల్ సాంగ్స్ ఇలా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది.

అయితే నోరాకు పాటలు డాన్స్ పరంగానే కాదు. సోషల్ మీడియాలో ఆమె స్టైలిష్ ఫోటోస్ - గ్లామర్ లుక్స్ కు కూడా మిలియన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో నోరాకి వెన్నతో పెట్టిన విద్య. అందుకే దాదాపు రెండు కోట్లకు పైగా ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ వయ్యారి ఇంస్టాగ్రామ్ వేదికగా న్యూ స్టైలిష్ ఫోటోస్ షేర్ చేసింది. ఈ ఫోటోలలో అమ్మడు బ్లూ కలర్ స్టైలిష్ హార్ గ్లాస్ మోడరన్ డ్రెస్సులో కిక్కిస్తుందని చెప్పవచ్చు. నీలిరంగు స్లీవ్ డ్రెస్సులో పర్ఫెక్ట్ ఫిట్నెస్ తో అమ్మడు అటు నెటిజన్లను విపరీతంగా అట్ట్రాక్ట్ చేస్తోంది. నీలిరంగు ట్రెండీ డ్రెస్సులో నోరా మోడరన్ 'పరి'లా కనిపిస్తుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అమ్మడు "భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా" అనే సినిమాలో నటిస్తోంది.