Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్

By:  Tupaki Desk   |   25 Jan 2020 5:29 AM GMT
కేజీఎఫ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
X
2018 పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ సీక్వెల్ `కేజీఎఫ్: చాప్ట‌ర్-2` పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. కేజీఎఫ్ చాప్ట‌ర్ 1 సంచ‌ల‌న విజ‌యం నేప‌థ్యంలో సీక్వెల్ భారీ అంచ‌నాల న‌డుమ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. తొలి భాగాన్ని మించిన బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న కేజీఎఫ్ 2 రెట్టింపు అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఫాలోవ‌ర్స్ లో ఇప్ప‌టికే బోలెడంత‌ ఉత్కంఠ‌ నెల‌కొంది. స‌మ్మ‌ర్ రిలీజ్ అంటూ ప్ర‌క‌టించారు కాబ‌ట్టి .. రిలీజ్ తేదీ ఎప్పుడు ద‌గ్గ‌ర‌ప‌డుతుందా? అన్న ఆత్రం అభిమానుల్ని నిలవ‌నీయ‌డం లేదు.

అయితే ఫ్యాన్స్ కి కేజీఎఫ్ టీమ్ నుంచి బ్యాడ్ న్యూస్ త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు. పాన్ ఇండియా కేటగిరీలో తెర‌కెక్కుతున్న సినిమా కావ‌డంతో షూటింగ్ స‌హా ఇత‌ర ప‌నుల‌న్నీ బాగా డిలే అవుతున్నాయ‌ట‌. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా అనుకున్న టైమ్ లో పూర్త‌వ్వ‌డం క‌ష్ట‌మ‌ని యూనిట్ భావిస్తోంద‌ట‌. ఈ నేప‌థ్యంలో ఈ స‌మ్మ‌ర్ కి ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం క‌ష్ట‌మేన‌ని తెలుస్తోంది. సీక్వెల్ ప్రారంభోత్స‌వం రోజునే ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు 2020 స‌మ్మ‌ర్ కానుక‌గా రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

కానీ మాట నిల‌బెట్టుకుంటారా? అంటే.. తాజా స‌న్నివేశం అలా క‌నిపించ‌డం లేద‌ని తెలుస్తోంది. వేస‌వి నుంచి ఆగ‌స్ట్ కు వాయిదా వేసే యోచ‌న‌లో ఉన్నట్లు తెలుస్తోంది. స్వాతంత్య్ర‌ దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే కొత్త ఆలోచ‌న చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. మ‌రి ఇందులో నిజం ఎంత‌? అన్న‌ది చిత్ర‌బృందం అధికారికంగా వెల్ల‌డిస్తే గానీ క్లారిటీ రాదు. ఇందులో క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌శ్ హీరోగా న‌టిస్తున్నారు. బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ ప్ర‌తి నాయ‌కుడి పాత్ర పోషిస్తున్నారు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హోంబ‌లే ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది.