రాజ్ కుంద్రా అరెస్ట్: వీడియో కాల్ లో నగ్నంగా ఆడిషాన్.. నటి ఆరోపణ

Tue Jul 20 2021 19:00:01 GMT+0530 (IST)

Back when actress accused Raj Kundra of demanding nude audition

ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా కేసులో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోర్న్ వీడియోలు తీయించి కొన్ని యాప్‌ల ద్వారా ప్రసారం చేసిన కేసులో రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక కుట్రదారుడిగా కనబడుతున్నాడని ముంబై పోలీసులు తెలిపారు. తాజాగా రాజ్ కుంద్రాను కోర్టులో హాజరుపరిచారు. అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని జూలై 23 వరకు కోర్టు పోలీసు కస్టడీకి పంపింది.ఈ క్రమంలోనే  మోడల్ నటి సాగరిక సోనా బయటకు వచ్చి మాట్లాడారు. ఒక ఇంటర్వ్యూలో సోనా తాజాగా రాజ్ కుంద్రాపై సంచలన ఆరోపణలు చేశారు. అవిప్పుడు వైరల్ గా మారాయి. ‘నేను మోడల్ ను అని.. మూడు నాలుగేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానని.. పెద్దగా అవకాశాలు రాలేదని.. ఈ క్రమంలోనే లాక్ డౌన్ లో నాకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయని’ సోనా తెలిపింది.

 గత ఏడాది ఆగస్టులో ఉమేశ్ కామత్ అనే వ్యక్తి నుంచి నాకు ఫోన్ వచ్చిందని.. రాజ్ కుంద్రా నిర్మిస్తున్న వెబ్ సిరీస్ లో చాన్స్ ఇప్పిస్తానని చెప్పాడని.. ఇంతకీ కుంద్రా ఎవరని అడిగితే శిల్పా శెట్టి భర్త అని పేర్కొన్నాడని’ సోనా పేర్కొంది. వెబ్ సిరీస్ లో నటిస్తే మంచి అవకాశాలు వస్తాయని నమ్మించారని.. కోవిడ్ టైం కాబట్టి వీడియో కాల్ ద్వారా ఆడిషన్ నిర్వహిస్తామని చెబితే ఒప్పుకున్నానని సోనా తెలిపింది.

ఈ క్రమంలో ఆ వీడియో కాల్ లో ముగ్గురు జాయిన్ అయ్యాక.. నన్ను నగ్నంగా ఆడిషన్ లో పాల్గొనాలని అన్నారని.. అది విని తాను షాక్ అయ్యానని.. వెంటనే కుదరదని తేల్చిచెప్పినట్టు సోనా వివరించింది.

ఆ వీడియో కాల్ లో ముఖం కనిపించకుండా మాస్క్ పెట్టుకున్న వ్యక్తి రాజ్ కుంద్రా అయ్యి ఉంటాడని అనిపిస్తోందని ఆమె ఆరోపించారు. నిజంగా అతడు ఇలాంటి చర్యలకు పాల్పడితే రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసి ఈ రాకెట్ గుట్టు రట్టు చేయాలని కోరుకుంటున్నానని సోనా తెలిపారు.

ఇక సోనా ఆరోపించిన ఉమేశ్ కామత్ తాజాగా రాజ్ కుంద్రా కేసులో ప్రధాన సూత్రధారిగా అరెస్ట్ అయ్యాడు.అతడే రాజ్ కుంద్రా తీసిన పోర్న్ వీడియోలు అప్ లోడ్ చేశాడని తేల్చారు. దీంతో సోనా ఆరోపించినట్టు వీడియోలో ఉందని రాజ్ కుంద్రానే అని పలువరు అనుకుంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.