బ్యాచిలర్ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి..??

Fri Oct 22 2021 20:00:01 GMT+0530 (IST)

Bachelor Director What is the next project

2006 లో 'బొమ్మరిల్లు' వంటి సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన భాస్కర్.. ఈ పదిహేనేళ్ల కెరీర్ లో కేవలం ఆరు సినిమాలను మాత్రమే డైరెక్ట్ చేశారు. హిట్టు ప్లాప్ లను పక్కన పెడితే సినిమా సినిమాకి భాస్కర్ గ్యాప్ తీసుకుంటూ వస్తుండటంతో ఆయన ఫిల్మోగ్రఫీలో తక్కువ సినిమాలు ఉన్నాయని చెప్పవచ్చు.'బొమ్మరిల్లు' తర్వాత రెండేళ్ల విరామం తీసుకున్న భాస్కర్.. 'పరుగు' చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు ఇచ్చినా.. 'ఆరెంజ్' సినిమాకి మళ్ళీ రెండేళ్ల గ్యాప్ వచ్చింది. ఈ సినిమా ప్లాప్ అవడంతో ఈసారి మూడేళ్లకు గానీ తదుపరి మూవీ 'ఒంగోలు గిత్త' ను రిలీజ్ చేయలేకపోయారు. ఇది నిరాశ పరచడంతో 'బెంగుళూరు డేస్' తమిళ రీమేక్ తో కోలీవుడ్ లో అడుగుపెట్టారు. ఈ క్రమంలో ఏకంగా ఐదేళ్ల విరామం తర్వాత 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు భాస్కర్.

అఖిల్ అక్కినేని - పుజా హెగ్డే హీరోహీరోయిన్లుగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా విజయం అఖిల్ తో పాటుగా భాస్కర్ కు చాలా ఊరటనిచ్చింది. అయినప్పటికీ బొమ్మరిల్లు దర్శకుడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే సందిగ్ధత మాత్రం అలానే ఉండటం గమనార్హం.

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు అందరూ ఒక హిట్ పడంగానే వరుస ప్రాజెక్ట్స్ కమిట్ అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు భాస్కర్ మాత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' తర్వాత వెంటనే మరో సినిమా ఎనౌన్స్ చేస్తాడా? లేక ఎప్పటిలాగానే మళ్లీ కెరీర్ లో గ్యాప్ తీసుకుంటాడా అనేది ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ.. తన దగ్గర రెండు మూడు లైన్లు రెడీగా ఉన్నాయని ప్రకటించారు. ఎవరికైనా నచ్చితే దాన్ని డెవలప్ చేస్తానని తెలిపారు.

అయితే బొమ్మరిల్లు దర్శకుడి తదుపరి సినిమా కూడా గీతా ఆర్ట్స్ 2 సంస్థలోనే ఉండే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఎనిమిదేళ్ల తర్వాత భాస్కర్ ను ఇండస్ట్రీకి తీసుకొచ్చిన అల్లు అరవింద్.. ఇప్పుడు మరో సినిమా అవకాశం ఇస్తున్నారట. మంచి స్టోరీ రెడీ చేస్తే హీరోని కూడా సెట్ చేస్తామనే ఆఫర్ ఇచ్చారట. కాకపోతే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవడానికి కాస్త సమయం పట్టనుంది. సో భాస్కర్ నుంచి వెంటనే మరో సినిమా రాకపోవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి త్వరలోనే టాలెంటెడ్ దర్శకుడి నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద క్లారిటీ వస్తుందేమో చూడాలి.