Begin typing your search above and press return to search.

నాగబాబుపై మళ్లీ రెచ్చిపోయిన బాబు గోగినేని

By:  Tupaki Desk   |   18 April 2021 12:30 PM GMT
నాగబాబుపై మళ్లీ రెచ్చిపోయిన బాబు గోగినేని
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కరోనా రావడం.. దాని మీద వచ్చిన పోస్టులపై ప్రముఖ హేతువాది, బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని వివాదాస్పద పోస్టు చేయడం దుమారం రేపింది. దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తోపాటు నాగబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాబు గోగినేనిని కుక్కతో పోల్చాడు.

ఇంతకీ అసలు వివాదం ఏంటంటే... పవన్ కళ్యాణ్ చికిత్స పొందుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆయనను వివేకానంద, చేగువేరా పరామర్శించినట్టు కొందరు ఎడిట్ చేసి వైరల్ చేశారు. ఈ ఫొటోపై బాబు గోగినేని కామెంట్ చేశాడు. మండేలా, గాడ్సే, గాంధీ, కూడా వస్తారని.. ఆర్జీవీ దీనిపై సినిమా తీయాలని.. పంచె నలుగకుండా.. జట్టు దువ్వుకొని పడుకున్న పవన్ అంటూ బాబు తీవ్ర విమర్శలు చేశారు.

కరోనాతో బాధపడుతున్న పవన్ పై బాబు గోగినేని కామెంట్స్ పవన్ ఫ్యాన్స్ కు చిర్రెత్తుకొచ్చాయి. దీనిపై నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ‘నాకు ఇలాంటివి ఫార్వర్డ్ చేయకండయ్యా.. నాకు కేవలం పెంపుడు కుక్కలు అంటేనే ఇష్టం.. బాబు గోగినేని మీద ఇంట్రస్ట్ లేదు’ అంటూ కౌంటర్ ఇచ్చారు.

ఇక నాగబాబు కౌంటర్ కు బాబు గోగినేని కూడా రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. ‘గాంధీ గారి హంతకుడిని దేశ భక్తుడు అన్న దుష్టుడు తన పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్నాడు’ అని బాబు గోగినేని సంచలన పోస్టు పెట్టాడు. కుక్కలు కాక మనుషులు తిరుగుతారా? నీ చుట్టూ కొన్నింటిని ఇంటర్నెట్ లో వదిలినట్టువు.. కట్టేసుకో అని ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు వీరిద్దరి సమరం సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చకు దారితీస్తోంది.