Begin typing your search above and press return to search.

బాలయ్య, ఎన్టీఆర్ లను కలపబోతున్న పండుగ

By:  Tupaki Desk   |   7 Jun 2020 1:30 PM GMT
బాలయ్య, ఎన్టీఆర్ లను కలపబోతున్న పండుగ
X
తెలుగు నేలపై నందమూరి కుటుంబానికి గొప్ప చరిత్ర ఉంది. అన్న నందమూరి తారకరామారావు టాలీవుడ్ ధృవతారగా వెలిగి రాజకీయాల్లోకి వచ్చి ఏపీ సీఎంగా చెరగని ముద్రవేశారు. సినిమాలు, రాజకీయాల్లో తిరుగులేని స్టార్ డం సంపాదించారు.

అయితే చరిత్ర ఆయనతో ముగియలేదు. ఆయన వారసులు కూడా సినీ, రాజకీయ రంగంలోకి వచ్చారు. ఎన్టీఆర్ నాడు బాలక్రిష్ణను సినీ రంగ ప్రవేశం చేయించారు ఇప్పుడు ఆయన రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారు.. హరికృష్ణ స్వతహాగా పలు చిత్రాల్లో నటించారు. ఇప్పుడు మూడో తరంలో జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఉన్నారు.

సినిమాల్లో.. రాజకీయాల్లో దూసుకుపోతున్నారు ఎన్టీఆర్ వారసులు.. అయితే కొన్నేళ్లుగా నందమూరి ఫ్యామిలీలో విభేదాలు తలెత్తాయనే ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా బాబాయ్ బాలక్రిష్ణ, అబ్బాయి జూ.ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. బాలయ్య, ఎన్టీఆర్ ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది.

అయితే నందమూరి ఇంట ఓ పండుగ ఇప్పుడు బాబాయ్ అబ్బాయిని కలపబోతోందట.. ఈ పండుగకు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరుకాబోతున్నాడట.. అదే బాలయ్య షష్టిపూర్తి వేడుక.. నందమూరి ఫ్యామిలీలో దీన్ని ఘనంగా నిర్వహించబోతున్నారట.. మొత్తం నందమూరి హీరోలు , అన్నాదమ్ములంతా హాజరు కాబోతున్నట్టు తెలిసింది. జూన్ 10న 60వ పడిలోకి బాలక్రిష్ణ అడుగుపెట్టబోతున్నారు. దీనిని పురస్కరించుకొని భారీ ఫంక్షన్ నిర్వహిస్తున్నారట.. దీనికి జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, చంద్రబాబు , పురంధేశ్వరి సహా నందమూరి కుటుంబమంతా హాజరు కాబోతోందట.. సో ఈ వేడుకతో ఇక వివాదాలు, విభేదాలు నందమూరి ఇంట సమసిపోనున్నాయన్న మాట..