బాహుబలి బ్యాచ్ అంతా కట్టకట్టుకుని వచ్చారే!

Mon Feb 24 2020 14:45:54 GMT+0530 (IST)

Baahubali Team Attend for Hit Movie Pre Release Event

యువ హీరో విశ్వక్ సేన్ నటించిన 'హిట్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఈ సినిమాను న్యాచురల్ స్టార్ నాని సమర్పిస్తుండగా.. ప్రశాంతి తిపిరినేని నిర్మిస్తున్నారు. కొలను శైలేష్ ఈ చిత్రానికి దర్శకుడు.  'హిట్' ప్రీ రిలీజ్ ఈవెంటుకు 'బాహుబలి' టీమ్ మెంబర్స్ రావడంతో అదో స్పెషల్ ఈవెంటుగా మారిపోయింది.  దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. రానా దగ్గుబాటి.. అనుష్క అతిథులుగా హాజరుకావడంతో వేదిక కళకళలాడింది.  నానికి రాజమౌళితో సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఈగ' సినిమాలో నాని హీరోగా నటించిన సమయం నుండి వారి మధ్య సాన్నిహిత్యం ఉంది.  అయితే రానా దగ్గుబాటి.. అనుష్కలు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది.  'బాహుబలి' టీమ్ ఇలా కలిసి కనిపించడం అరుదుగా జరుగుతుంది. మరి ఈ సినిమా కార్యక్రమానికి అందరూ కలిసి హాజరయ్యారంటే ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.
 
ఈ ఫ్రేమ్ లో కనిపిస్తున్న హీరో హీరోయిన్ల కాంబినేషన్ లో సినిమా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రాజమౌళి ప్రస్తుతం 'RRR' తో బిజీగా ఉన్నారు. మరి ఈ సినిమా తర్వాత టేకప్ చేయబోయే ప్రాజెక్టులో ఉంటారేమో వేచి చూడాలి. ప్రస్తుతానికైతే ఇవన్నీ ఊహాగానాలే.