Begin typing your search above and press return to search.

బీవీఎస్ రవి నిర్మాణంలో 'మొగలిరేకులు' ఆర్కే నాయుడు యాక్షన్ థ్రిల్లర్...!

By:  Tupaki Desk   |   29 Sep 2020 1:30 PM GMT
బీవీఎస్ రవి నిర్మాణంలో మొగలిరేకులు ఆర్కే నాయుడు యాక్షన్ థ్రిల్లర్...!
X
తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన చిత్రాలకు కథ, మాటలు అందించిన రైటర్ కమ్ డైరెక్టర్ బివిఎస్.రవి మ‌ళ్లీ నిర్మాతగా మార‌నున్నారు. టాలీవుడ్ ప్రముఖులు ప్రేమగా 'మచ్చ రవి'గా పిలుచుకునే B.V.S. రవి ప్రొడ్యూసర్ గా మారి గతంలో 'సెకండ్ హ్యాండ్' అనే సినిమా నిర్మించాడు. ఈ సినిమాతో టాలెంటెడ్ డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌ల‌ తెలుగు చిత్ర సీమ‌కు ప‌రిచ‌యం అయ్యాడు. ఇదే క్రమంలో బీవీఎస్ ర‌వి టాలీవుడ్ కు మరో నూతన దర్శకుడు రమేష్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు.

'మొగలిరేకులు' డైలీ సీరియల్ తో తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీ సంపాదించుకున్న నటుడు సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. సాగర్ తో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో బీవీఎస్ రవి మ‌రోమారు అతన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్ట‌ర్ కి కూడా చాలా ప్రాధాన్యం ఉండబోతోందని తెలుస్తోంది. టాలీవుడ్ లో ఇంత‌వ‌ర‌కు రాని ఓ డిఫరెంట్ క్యారెక్ట‌రైజేష‌న్ తో ఈ సినిమాలో హీరోయిన్ పాత్రని తీర్చిదిద్దుతున్న‌ట్లుగా స‌మాచారం.

కాగా, డైరెక్టర్ రమేష్ గతంలో గౌతమ్ మీనన్ - వైవిఎస్. చౌదరి వంటి స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు. కొత్త కాన్సెప్ట్స్ తో వస్తోన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారనే విషయం ఎన్నోసార్లు నిరూపితమైంది. ఇప్పుడు అదే తరహాలో బీవీఎస్ రవి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రైటర్ గా ఎన్నో సినిమాలకు పనిచేసిన అనుభవం ఉన్న బీవీఎస్ రవి అందిస్తున్న స్టోరీ - స్క్రీన్ ప్లే ఈ సినిమాలో మరింత ఆసక్తికరంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.