స్టార్ హీరో ధనుష్ కి బ్రిక్స్ పురస్కారం

Mon Nov 29 2021 20:40:42 GMT+0530 (IST)

BRICS Award for Star Hero Dhanush

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా వేట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన `అసురన్` ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. సమాజంలో అసమానతలు.. అంటరానితనాన్ని హైలైట్ చేస్తూ నిరుపేద కుటుంబాలు సమాజంలో ఎలా పీడింపబడుతున్నాయి? అన్న పాయింట్ ని అద్బుతంగా తెరెక్కించారు. కమర్శియల్ గా ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. ఇక అసురన్ కి అవార్డుల పంట పండింది. జాతీయ చలన చిత్రోత్సవాల్లో 3 అవార్డులను సొంతం చేసుకోగా.. 78వ గోల్డెన్ గ్లోబ్ అవార్స్డ్ లో ఉత్తమ  విదేశీ  చిత్రం కేటగిరీ కింద ప్రదర్శింపబడింది. సినిమాలో నటించిన ధనుష్ కి అవార్డులు దక్కాయి.తాజాగా ధనుష్ బ్రిక్స్ పురస్కారం సొంతం చేసుకున్నారు. బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో `అసురన్` చిత్రానికి గాను ధనుష్ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. ఇటీవలే జరిగిన గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాతో పాటు బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా జరిగింది. ఆ వేడుకలో నే ధనుష్ అవార్డు దక్కించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇది నాకు పరిపూర్ణ గౌరవం అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో నెటిజనులు ధనుష్ కి అభినందనలు తెలియజేసారు.

కాగా `అసురన్` చిత్రం తెలుగులో `నారప్ప` టైటిల్ తో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో వెంకటేష్ హీరోగా నటించగా  శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించారు. ఇక్కడా పెద్ద సక్సెస్ అయింది. ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్ రిలీజ్ అయితే ఇంకా పెద్ద సక్సెస్  అయ్యేదని ట్రేడ్ నిపుణులు భావించారు. ఈ సినిమాతో వెంకటేష్ కి నటుడిగా మంచి పేరొచ్చింది.  స్ట్రెయిట్ సినిమా అయ్యి ఉంటే వెంకీకి ధనుష్ కి దక్కాల్సిన గౌరవం దక్కేది. కానీ ఇది రీమేక్ వెర్షన్ కావడంతో అవార్డులకు ఆస్కారం లేదు.