Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU : సరయు అందుకున్న పారితోషికం

By:  Tupaki Desk   |   14 Sep 2021 12:30 PM GMT
#BIGGBOSS5TELUGU : సరయు అందుకున్న పారితోషికం
X
తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 5 నుండి ఎలిమినేట్ అయిన మొదటి కంటెస్టెంట్‌ 7 ఆర్ట్స్ సరయు. ఈమె కాస్త ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉందని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఆమె బిగ్ బాస్ నుండి మొదటి వారంలోనే ఎలిమినేట్‌ అయ్యింది. జెస్సీ మరియు కాజల్ లు కూడా తక్కువ ఓట్లు దక్కించుకున్నా కూడా వారి కంటే కూడా సరయుకు అతి తక్కువ ఓట్లు వచ్చాయి అంటూ స్టార్‌ మా వర్గాల వారు చెబుతున్నారు. సరయు ఈ వారంలో కూడా ఉండి ఉంటే ఖచ్చితంగా ఆమె నుండి చాలా టఫ్‌ ఫైట్‌ ను ఇంటి సభ్యులు ఎదుర్కొని ఉండేవారు. అయితే సరయు మాట తీరు మరియు ఇతరులతో ఆమె వ్యవహరించే తీరు అనేది చాలా మందికి నచ్చలేదు. దాంతో ఆమెకు ఓట్లు వేయలేదని తెలుస్తోంది. బిగ్‌ బాస్ సీజన్‌ 5 లో మొదటి ఎలిమినేషన్ గా వెళ్లి పోయిన సరయుకు దక్కిన పారితోషికం ఎంత అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

సాదారణంగా అయితే కంటెస్టెంట్స్ కు వారం వారం పారితోషికం ఉంటుంది. అలాగే సరయు విషయంలో కూడా అదే రిపీట్‌ చేశారు. సరయుకు వారంకు లక్ష రూపాయల పారితోషికంను ముందస్తుగానే మాట్లాడుకున్నారట. ఆ పారితోషికంనే ఆమె వెళ్లి పోయిన తర్వాత అందుకోబోతుంది. షో రూల్స్ ప్రకారం ఆమె కొన్నాళ్ల పాటు ఇతర టీవీ ఛానెల్స్ లో షో లు చేయడం కాని.. ఇతర షోలకు వెళ్లడం కాని చేయకూడదు. స్టార్‌ మా లో కనీసం ఆరు నెలల పాటు బిగ్‌ బాస్ కు సంబంధించి ఏ షో జరిగినా కూడా రావాల్సి ఉంటుంది. అందుకు అదనంగా పారితోషికం ఇస్తూ ఉంటారు. కనుక ఈ లక్ష తో కాకుండా ఆమెకు స్టార్‌ మా నుండి ముందు ముందు పారితోషికం అందుతూనే ఉంటుంది.

సరయు పారితోషికం వారంకు లక్ష అయితే ఇతర కంటెస్టెంట్స్ పారితోషికం ఎంత అయ్యి ఉంటుంది అనే ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. ఇద్దరు ముగ్గురికి వారంకు యాబై వేల రూపాయలు కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక అయిదుగురుకు ఏకంగా అయిదు లక్షలు ఆపై కూడా వారంకు ఇస్తున్నారట. మొత్తానికి బిగ్‌ బాస్‌ రూల్స్ ప్రకారం ఎవరి రేంజ్ స్టార్‌డమ్‌ కు తగ్గట్లుగా వారి పారితోషికం ఇస్తున్నారు. ఈసారి సరయుకు ఇచ్చిన పారితోషికం ఆమె రేంజ్ ను మించే అన్నట్లుగా కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. సరయు ఎలిమినేట్‌ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ రచ్చ చేస్తోంది.అందరి ఫొటోలు ఇరగొట్టి ఆడంగి అంటూ అడ్డమైన బూతులు తిడుతూ చేసిన వ్యాఖ్యలు ఆ ఇంటర్వ్యూ రేంజ్ ను పెంచేశాయి. కనుక సరయు వల్ల స్టార్ వారికి ఆ విధంగా కూడా లాభమే.