Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU : బ్రహ్మణుల అమ్మాయి ఐనా తాగే అలవాటుందట

By:  Tupaki Desk   |   14 Sep 2021 5:30 PM GMT
#BIGGBOSS5TELUGU : బ్రహ్మణుల అమ్మాయి ఐనా తాగే అలవాటుందట
X
తెలుగు బిగ్‌ బాస్ మొదటి వారంలో అందరి దృష్టిని ఆకర్షించిన కంటెస్టెంట్స్ లో లహరి. ఈమె అర్జున్‌ రెడ్డి సినిమాలో కనిపించింది. ఆ సినిమా లో హీరో పాత్ర తరహాలో ఈమె కూడా హైపర్ అవుతుందని.. లహరి మరీ చిన్న విషయాలకు కూడా రెచ్చి పోతుంది అంటూ విమర్శలు ఎదురయ్యాయి. అయినా కూడా తన పద్దతి మార్చుకునేది లేదు అంటూ తాజాగా మరోసారి కూడా చెప్పకనే చెప్పింది. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈమె హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చాలా కాలంగానే చేస్తుంది. కాని ఈమెకు మాత్రం ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. అయినా కూడా పట్టుదలతో సోషల్‌ మీడియా ద్వారా గుర్తింపు దక్కించుకుని మెల్ల మెల్లగా ప్రేక్షకులకు దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తోంది.

బిగ్‌ బాస్ కు వెళ్లక ముందు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. ఆ ఇంటర్వ్యూలో లహరి మాట్లాడుతూ.. తాను బ్రహ్మణుల కుటుంబంకు చెందిన అమ్మాయిని. అయినా కూడా నాకు నాన్ వెజ్ అలవాటు ఉంది. డ్రింక్ కూడా సందర్బానుసారంగా చేస్తాను. నా కుటుంబ సభ్యులు నాకు పూర్తి మద్దతుగా నిలుస్తారు. మా ఫ్యామిలీలో అమ్మాయిని నేను ఒక్కదాన్నే అవ్వడం వల్ల నాకు అన్ని విధాలుగా కుటుంబ సభ్యులు మద్దతుగా నిలుస్తారు. అందుకే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను అంటూ లహరి చెప్పుకొచ్చింది.

మా అమ్మ ఒక డిజైనర్ అయినా కూడా నేను ప్రతి సారి పద్దతైన డ్రస్ లు మాత్రమే వేసుకున్నాను. ప్రతి సారి నా డ్రస్ ల విషయంలో అమ్మ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. నాకు ఎలాంటి డ్రస్ లు సూట్ అవుతాయో అమ్మకు బాగా తెలుసు. అందుకే నా కాస్ట్యూమ్స్ విషయంలో అమ్మ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. నాపై నాకు ఎక్కువ నమ్మకం ఉంటుంది. నాకు నా కుటుంబం బలం.. వారి వల్లే నేను ఏ పని అయినా చేయగలుగుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇంకా కుటుంబం గురించి కెరీర్ గురించి పలు విషయాలను లహరి వెళ్లడించింది.