Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU E21 : రవి- లహరి- ప్రియాల గొడవ దోషి నిర్థారణ

By:  Tupaki Desk   |   26 Sep 2021 6:30 AM GMT
#BIGGBOSS5TELUGU E21 : రవి- లహరి- ప్రియాల గొడవ దోషి నిర్థారణ
X
మూడవ వారం ఎలిమినేషన్ నామినేషన్‌ సమయంలో జరిగిన రచ్చ చాలా సీరియస్‌ అయ్యింది. లహరి గురించి మాట్లాడుతున్న సమయంలో ఆమె అబ్బాయిలతో ఎక్కువ సమయం గడుపుతుంది. నాకు ఆమెతో కలిసి మాట్లాడే సమయం దక్కడం లేదు అంటూ ప్రియా చేసిన వ్యాఖ్యలు రాంగ్ అయ్యాయి. లహరి నేను ఎవరితో మాట్లాడుతున్నాను అంటూ ఆమె పదే పదే రెచ్చ గొట్టేలా ప్రశ్నించింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన ప్రియా స్పందిస్తూ నువ్వు రవి టాయిలెట్స్ వద్ద లేట్ నైట్‌ కౌగిలించుకున్నారు. ఆ సమయంలో మిమ్మలను నేను చూశాను అంటూ చెప్పింది. ఆ వివాదం వారం మొత్తం ఏదో ఒక సమయంలో కొనసాగుతూనే వచ్చింది. మెల్లగా దాని నుండి బయట పడుతున్నారు అనుకున్న సమయంలో మళ్లీ ఆ విషయాన్ని రెచ్చ గొట్టేలా నాగార్జున వీకెండ్‌ ఎపిసోడ్‌ లో ఎత్తి ఎవరిది తప్పు అనే విషయాన్ని జడ్జ్‌ చేసే ప్రయత్నం చేశాడు. రవి మరియు ప్రియాలకు క్లాస్ పీకిన నాగార్జున ఆ తర్వాత రవి మాట్లాడిన వీడియోను పవర్ రూమ్‌ లో లహరికి చూపించడం జరిగింది. ఆ సమయంలో యాంకర్‌ కావాలనుకుంటున్న లహరి తన వెంట పడుతుంది అన్నట్లుగా రవి మాట్లాడుతూ ప్రియాతో చెప్పడం జరిగింది. ఆ వ్యాఖ్యలు కు లహరి చాలా ఫీల్ అయ్యింది. నిజం తెలిపినందుకు కృతజ్ఞతలు అంటూ బయటకు వెళ్లి ప్రియా ను హగ్ చేసుకుని రవి నువ్వు అలా మాట్లాడి ఉండకూడదు అనింది.

నాగ్‌ ఎపిసోడ్‌ ప్రారంభంకు ముందు ముందు రోజు జరిగింది చూపించడం జరిగింది. అందులో మానస్‌ జైల్లో ఉండగా అక్కడకు వెళ్లి కొందరు మాట్లాడుతూ ఉండటం జరిగింది. ఒకానొక సందర్బంలో షణ్ను ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత జెస్సీ తో మాట్లాడుతూ నేను బిగ్ బాస్ హౌస్ కు సెట్‌ కాదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. జెస్సీ మాత్రం నువ్వు టైటిల్‌ ట్రోఫీ పట్టుకుంటావు అనే నమ్మకంను వ్యక్తం చేశాడు. శ్రీరామ చంద్ర పాడిన పాటకు లోబో చూస్తూ ఉండగా ప్రియాంక చేసిన డాన్స్ అందరిని ఆకట్టుకుంది. ఆమె నడుము ఊపుతూ చేసిన డాన్స్ కు వావ్‌ అంటూ ఆ తర్వాత నాగార్జున కూడా అభినందనలు తెలియజేశాడు. ఇక మానస్ ను విడుదల చేయాల్సిందిగా బిగ్‌ బాస్ ఆదేశించడంతో కెప్టెన్‌ కీ తీసుకు వచ్చి విడుదల చేశాడు. ఆ సమయంలో ఇక్కడే బాగుంది బిగ్‌ బాస్ అంటూ మానస్ అన్నాడు. ఆ వ్యాఖ్యలకు కూడా ఆ తర్వాత నాగార్జున క్లాస్ పీకాడు.

ఇక నాగార్జున ఇంటి సభ్యులు ఒకొక్కరి గురించి మాట్లాడుతూ వారి పేరుతో ఉన్న స్లేట్స్ ను పగులగొడుతూ వారి తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. షణ్ను ఎవరో ఏదో అనుకుంటున్నారు.. ఇద్దరు కలిసి ఆడుతున్నారు అంటూ ఉన్నారని సిరిని దూరం పెడుతున్నాడు. ఆ విషయాన్ని నాగార్జున లేవనెత్తి అలా ఎందుకు అనుకుంటున్నావు నీవు.. నీ ఆట నీవు ఆడు. వెళ్లి పోయిన వారు అంటున్నారు అని నీకు అనిపిస్తే వారు వెళ్లి పోయారు కదా ఇంకా ఏంటీ సమస్య అంటూ షణ్ను మరియు సిరిలను మళ్లీ ఫ్రెండ్స్ చేశాడు. అలాగే జెస్సీని సొంతంగా కెప్టెన్ గా ఉండనివ్వు. నీవు అతడి పనిలో ఇన్వాల్వ్‌ అవ్వకు అన్నాడు. ఇక విశ్వ పదే పదే ఏడ్చినప్పుడు బాగా లేదని స్ట్రాంగ్ గా ఉండాలంటూ నాగార్జున సూచించాడు. ఇక మానస్ విషయంలో కూడా నాగార్జున సీరియస్ అయ్యాడు. సింపథీ కోరుకుంటున్నావా అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత షట్ ది డోర్‌ అనే ఆట ఆడించాడు. ఇంట్లో ఎవరికి అయితే ఉండే అర్హత లేదో వారి మొహాన డోర్ వేయాలంటూ చెప్పాడు. అప్పడు కొందరు సేఫ్ గేమ్‌ ప్లే చేసి నొప్పించకుండా జాగ్రత్తగా ఆడారు. ఎక్కువ మంది సిల్లీ రీజన్స్ చెప్పి లోబోను బయటకు పంపించాలని అనుకుంటున్నట్లుగా చెప్పారు. ఇక తాజా ఎపిసోడ్‌ లో మొత్తం అయిదుగురు నామినేషన్ లో ఉండగా మొదటగా ప్రియాంక సేఫ్‌ అయ్యింది. ఆ తర్వాత శ్రీరామ చంద్ర కూడా సేఫ్‌ అయ్యాడు. ఇంకా నామినేషన్ లో ముగ్గురు ఉన్నారు. ఈ వారం లహరి లేదా ప్రియాలో ఒకరు వెళ్లి పోతారని అంతా బలంగా అనుకున్నారు. అనుకున్నట్లుగానే లహరి ఎలిమినేట్‌ అయ్యిందని బిబి లీక్ వచ్చింది. ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.