Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU E20 : శ్రీమంతం సందడి.. పింకీ జెలస్‌

By:  Tupaki Desk   |   25 Sep 2021 6:30 AM GMT
#BIGGBOSS5TELUGU E20 : శ్రీమంతం సందడి.. పింకీ జెలస్‌
X
సిరితో మాట్లాడను అంటూ జెస్సీకి చెప్పి ఆమెను కాస్త దూరం పెట్టిన షణ్ను మళ్లీ కలిశాడు. బెడ్ మారుతాను అంటూ చెప్పిన షణ్ను మళ్లీ ఆమె పక్కనే పడుకున్నాడు. ఎపిసోడ్ ఆరంభంలో కొద్ది సమయం సిరి.. షణ్ను మరియు జెస్సీలు మాట్లాడుతూ పడుకున్నారు. పొద్దున్నే మాస్టర్ ఫైర్ అయ్యాడు. ఎలా ఆడాలో మినిమం నాలెడ్జ్‌ లేదు అంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేశాడు. అక్కడ రవి.. సన్నీ.. యానీ మాస్టర్ ఉన్నారు. ప్రొఫెషన్ గురించి మాట్లాడుతూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ నటరాజ్ మాస్టర్ సీరియస్ అయ్యాడు. ఆ సమయంలో ఎవరు ఆ మాట అన్నారో చెప్పాలంటూ సన్నీ గట్టిగా అడిగే ప్రయత్నం చేశాడు. అందుకు నటరాజ్ మాస్టర్ సమయం వచ్చినప్పుడు చెప్తానంటూ సమాధానం దాట వేశాడు. ఆ విషయమై రవి మరియు సన్నీలు కొద్ది సమయం చర్చించుకున్నారు. నటరాజ్ మాస్టర్‌ తీరు సరిగా ఉండటం లేదంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మానస్‌ హమీదాకు తినిపిస్తూ ఉండగా ప్రియాంక జెలస్ ఫీల్ అయ్యింది. చేతులు రెండు బాగానే ఉన్నాయి కదా తింటే ఏమైంది అంటూ ప్రియాంక విసుక్కోవడం జరిగింది. ఇద్దరు కలిసి తినడం లేదు.. అయినా కూడా మానస్ ముద్దలు పెడుతూ హమీదాను ముద్దు చేయడం ఏంటో అంటూ అక్కడున్న ఇతరులు కూడా కొందరు ముక్కున వేలేసుకున్నారు.

నీకు కూడా తినిపించాలా అంటూ ప్రియాంకను మానస్ అడిగాడు. ఆ సమయంలో ప్రియాంక పట్టించుకోనట్లుగా వ్యవహరించింది. లోబో నిద్ర పోవడంతో కుక్కలు మొరిగాయి. అయితే జెస్సీ అడిగిన సమయంలో మాత్రం లోబో తాను కాదు అన్నాడు. దాంతో పనిష్మెంట్‌ గా తనకు తాను శిక్షను విధించుకుని అయిదు గుంజీలు తీశాడు. ఆ సమయంలోనే లోబో నేనే నిద్ర పోయాను అని ఒప్పుకున్నాడు. ప్రతి వారం లాగే తాజా ఎపిసోడ్‌ లో కూడా వరస్ట్‌ ఫెర్ఫార్మర్ ను ఎంపిక చేయడం జరిగింది. ఆ సమయంలో మొదటగా మానస్ తనకు తాను వరస్ట్‌ అన్నాడు. దాంతో అతడి తీరు బాగా లేదు అంటూ చాలా మంది చాలా రకాలుగా ఆయన్ను వరస్ట్‌ అన్నారు. గత వారం రోజులుగా అతడి లో గా ఉన్నాడు. కనుక అతడిని వరస్ట్‌ అన్నారు. వరస్ట్‌ అంటూ మానస్ ను జైల్లో వేశారు. కొందరు మాత్రం మానస్ ను జైల్లో వేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు అంటూ వారించే ప్రయత్నం చేశారు. మొత్తానికి మానస్ జైలుకు వెళ్లాడు. అక్కడ అతడికి పరామర్శలు ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా మానస్ జైల్లో పడ్డ సమయంలో ప్రియాంక సంబర పడింది. ఎందుకంటే హమీదాకు ఇప్పుడు ఎలా తినిపిస్తావు అంటూ తెగ నవ్వేసింది. అప్పుడు ప్రియాంక జెలస్ చూసి బాబోయ్‌ మరీ ఇంత ఏంటీ నీకు అంటూ మానస్ అన్నాడు. లహరి కూడా మానస్ వద్దకు వెళ్లి కొద్ది సమయం మాట్లాడింది.

ఇంట్లో ఒక్కసారిగా పసిపాప నవ్వులు ఏడుపు వినిపించడంతో షాక్ అయ్యారు. ఏం జరుగుతుందో తెలియక అంతా కూడా అలా నిల్చుండి పోయారు. పిల్లలు ఉన్న కంటెస్టెంట్స్ వారి వారి పిల్లలను తల్చుకుని కన్నీరు పెట్టుకున్నారు. నటరాజ్ మాస్టర్ భార్య డెలవరీ అయ్యి ఉంటుందా అంటూ కొందరు అనుకున్నారు. ఆ తర్వాత స్టోర్ రూమ్ నుండి ఒక బొమ్మను పంపించిన బిగ్‌ బాస్ ఆ పిల్లాడి బొమ్మను చాలా ఆప్యాయంగా చూసుకోవాలంటూ సూచించాడు. ఆ తర్వాత కొంత సమయానికి టీవీలో నటరాజ్‌ మాస్టర్ భార్య శ్రీమంతం వీడియోను షేర్‌ చేశాడు. ఆ వీడియోలో నటరాజ్ మాస్టర్ భార్య మాట్లాడటం జరిగింది. ఆ సమయంలో అంతా కూడా ఎమోషనల్‌ అయ్యారు. తాజా ఎపిసోడ్‌ లో లగ్జరీ బడ్జెట్‌ టాస్క్ కూడా జరిగింది. ఇంటి సభ్యులు తమకు కావాల్సిన వస్తువులు ఉన్న బాల్స్‌ ను విసిరి ఎదురుగా నిలిపిన వాల్ కు అతుక్కునేలా చేశారు. అలా కొందరు బాల్స్ వేస్తే వృదా అవ్వగా కొందరు వేయగా వర్కౌట్ అయ్యింది. అలా లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ జరిగింది. తాజా ఎపిసోడ్‌ లో పెద్ద పెద్ద గొడవలు జరగకుండా సాఫీగానే సాగిపోయింది.