Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU E18 : నోరు జారిన షణ్ను.. ఇంట పెళ్లి సందడి

By:  Tupaki Desk   |   23 Sep 2021 4:02 AM GMT
#BIGGBOSS5TELUGU E18 : నోరు జారిన షణ్ను.. ఇంట పెళ్లి సందడి
X
బిగ్ బాస్ హౌస్ లో పెళ్లి సందడి కనిపించింది. తాజా ఎపిసోడ్ లో ఈ వారం కెప్టెన్సీ పోటీదారుడు అయ్యే టాస్క్ ను నిర్వహించారు. అమెరికా అబ్బాయి.. హైదరాబాద్ అమ్మాయి టాస్క్ లో భాగంగా ఎవరికి ఇచ్చిన రోల్స్ ను వారు తెగ పోషిస్తున్నారు. అన్ని విధాలుగా ఎంటర్ టైన్ చేస్తూ వస్తున్నారు. గత వారం మల్ల యుద్ద పోటీలను తలపించిన టాస్క్ ఈవారం మాత్రం సరదాగా సాగుతోంది. మద్య మద్యలో ఎమోషన్స్ కూడా కనిపిస్తున్నాయి. శ్రీరామ చంద్ర అమెరికా అబ్బాయిగా పాత్రలో లీనం అయ్యాడు. ఇక ఇంటి సభ్యులు పలువురు నిజంగా వీరు వారేనా అన్నట్లుగా లీనం అయ్యి ఎపిసోడ్ లో కనిపించారు. అంతుకు ముందు వరకు ఉన్న గొడవలు అన్ని కూడా పక్కన పెట్టి ఎంటర్ టైన్ మెంట్‌ ను పీక్స్ కు తీసుకు వెళ్లారు. పెళ్లి పెద్దలు మరియు పెళ్లి నిర్వహించే వారు.. పెళ్లి రద్దు అయ్యేలా చేసే వారు ప్రతి ఒక్కరు కూడా టాస్క్ లో ఢీ అంటే ఢీ.. నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడి మరీ నవ్విస్తున్నారు. ఈ క్రమంలో పెళ్లిల మీడియేటర్ గా ఉన్న షణ్ముఖ్‌ నోరు జారి శ్వేతను ఒక మాట అన్నాడు.. అది సీరియస్ కాకున్నా కూడా ఆమె కాస్త ఓవర్‌ గా రియాక్ట్ అయ్యింది.

ఇక యాంకర్ రవికి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. కెప్టెన్సీ పోటీదారుడిగా రవి డైరెక్ట్ గా ఎంపిక అయ్యే అవకాశం దక్కించుకున్నాడు. ప్రియ యొక్క నక్లెస్ ను దాచి పెట్టాల్సిన బాధ్యత రవికి ఇవ్వడం జరిగింది. రవి ఈ సీక్రెట్ టాస్క్‌ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించాడు. ఇక సిరి విషయంలో తాను కాస్త దూరంగా ఉండాలనుకుంటున్నట్లుగా షణ్ను చెప్పాడు. ఆమె సన్నీ పై చేసిన ఆరోపణలను తాను సమర్థించినందుకు గాను తనపై తనకు కోపంగా ఉందని.. తాను గేమ్‌ మరీ ఎక్కువగా ఆడుతుంది అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. నాకు ఎక్కడో కొడుతుంది.. అందుకే సిరి పక్కన ఉన్న తన బెడ్ ను మార్చుకోవాలనుకుంటున్నట్లుగా షణ్ను చెప్పాడు. ఆమెకు తాను సపోర్ట్‌ చేస్తున్నట్లుగా ప్రతి ఒక్కరు భావిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే ఆమెకు దూరంగా ఉండటం బెటర్ అనుకుంటూ షణ్నూ నిర్ణయం తీసుకున్నాడు. ప్రియ డబ్బు మరియు నగలు కనిపించడం లేదంటూ చర్చ మొదలు అయ్యింది. మొదట సిరి పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆ తర్వాత ప్రియా ఇల్లాంతా కూడా తన నగల కోసం వెదికింది. రవి మాత్రం వాటిని చాలా జాగ్రత్తగా కనిపించకుండా దాచి పెట్టాడు.

పెళ్లి సందడి టాస్క్ లో భాగంగా షణ్ముఖ్‌ పెళ్లి పంతులు కాగా లోబో మరియు శ్వేతలు ఈవెంట్‌ మేనేజర్స్. ఈ ముగ్గురి మద్య వ్యవహారం టాస్క్ లో భాగంగా సాగింది. లోబో మరియు శ్వేతలు ప్రేమించుకుంటూ ఉండగా తనకు సహకరించాలంటూ షణ్ను కోరాడు. షణ్ను నోరు జారి నువ్వు మళ్లీ మొహం మీద కొడతావు అన్నాడు. దాంతో వెంటనే శ్వేత కలర్ మారిపోయింది. ఆమె అలా అనడంతో ఆమె ఫీల్ అయ్యింది. ఆమె ఫీల్ అయిన విషయం షణ్ను కు అర్థం అయ్యింది. దాంతో వెంటనే వెళ్లి క్షమాపణలు చెప్పాడు. అయినా కూడా శ్వేత మాత్రం అతడి క్షమాపణ అంగీకరించలేదు. రాత్రి సమయంలో కొద్ది సేపు విశ్వ.. హమీదాలు ముచ్చట్లు పెట్టారు. మొత్తానికి అలా అలా సరదాగా ఎపిసోడ్ సాగింది.