బిగ్ బగ్ ట్రైలర్: మనుషుల్ని ఆడుకునే ఫన్నీ రోబోట్స్ స్టోరి

Mon Jan 17 2022 17:53:41 GMT+0530 (IST)

BIGBUG Trailer Talk

అత్యుత్తమ సాంకేతికతతో ఇటీవలి కాలంలో వెబ్ సిరీస్ లు ప్రపంచవ్యాప్త ఆడియెన్ కి రీచ్ అవుతున్నాయి. వినోదానికి దేశాల మధ్య అంతరాలు చెరిపేసిన తరుణంలో ఓటీటీలు సామ్రాజ్యాన్ని ఏల్తున్నాయి. ఇక ది బెస్ట్ అండ్ రిచ్ విజువల్స్ తో అసాధారణ బడ్జెట్లతో వెబ్ సిరీస్ లు సినిమాల్ని అందిస్తున్న నెట్ ఫ్లిక్స్ నుంచి తాజాగా `బిగ్ బగ్` పేరుతో కొత్త సినిమా అందుబాటులోకి వస్తోంది.మానవుడు ఇప్పుడు రోబోల కంట్రోల్ లోకి వెళ్లిపోయే సన్నివేశం కనిపిస్తోంది. రోబోట్స్ నిరంతరం మనిషి జీవితంలో భాగమై పని చేస్తున్నాయి. అందులోనూ బగ్స్ రూపంలో మనిషి ఆలనాపాలనా కనిపెట్టేసే డ్యూటీస్ చేసే స్థాయికి చేరుకున్నాయి. అయితే రోబోట్స్ ఎన్ని చేసినా కానీ వాటికి మనిషిలాగా ఎమోషన్స్ ఉండవన్నది తెలిసిందే. కానీ సినిమాలు సిరీస్ లలో ఎమోషన్స్ ఉంటే ఎలా ఉంటుంది? అన్నది ఆవిష్కరిస్తున్నారు.

ఇంతకుముందు శంకర్ తెరకెక్కించిన రోబో చిత్రం మ్యాజిక్ గురించి తెలిసిందే. ఇప్పుడు బిగ్ బగ్ సినిమా లోనూ రోబోట్స్ ఎమోషన్స్ ని రగిలిస్తున్నాయి. ఒక నగరాన్ని ఈగలు దోమల్లా రోబోట్స్ కంట్రోల్ లోకి తీసుకుంటే ఏం జరుగుతుందో కూడా ఈ సినిమా లో చూపించనున్నారని అర్థమవుతోంది. ఓవరాల్ గా ఫన్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ క్యూరియాసిటీని పెంచింది. టెక్నాలజీ బేస్డ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలకు ఇలాంటివి స్ఫూర్తిని నింపుతాయనడంలో సందేహం లేదు. బిగ్ బగ్ ఫ్రెంచ్ కామెడీ సైన్స్ ఫిక్షన్ మూవీకి జీన్ పియరీ మేకర్ గా కొనసాగుతున్నారు. 2050 కాలంలో సాగే కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కింది. ఫిబ్రవరి 11న విడుదలవుతోంది.