Begin typing your search above and press return to search.

BB4 వేదిక‌పై `సూప‌ర్` జోడీ నాగ్- అనుష్క‌!

By:  Tupaki Desk   |   27 Sep 2020 6:10 AM GMT
BB4  వేదిక‌పై `సూప‌ర్` జోడీ నాగ్- అనుష్క‌!
X
ఓవైపు క‌రోనా.. మ‌రోవైపు ఐపీఎల్.. ఇంకోవైపు ఓటీటీ హ‌వా. ఇన్ని ఉన్నా బుల్లితెర మ‌నుగ‌డ‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక మాస్ అభిమానం సంపాదించుకున్న బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోల‌కు ఆద‌ర‌ణ ఫ‌ర్వాలేద‌నిపిస్తోంది. ఐపీఎల్ గ‌ట్టి పోటీనిస్తున్నా బిగ్ బాస్ ఫాలోవ‌ర్స్ ఉండ‌నే ఉన్నారు. ప్ర‌స్తుతం తెలుగులో సీజ‌న్ 4 ర‌న్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. వారం వారం ఇంటి నుండి వెళ్లేవాళ్లు వెళుతూనే ఉన్నారు.

ఇక‌పోతే ఈ ఆదివారం స్పెష‌ల్ ఎపిసోడ్ లో ఊహించ‌ని ట్విస్ట్ ఒక‌టి ఉంది. అటు వేదిక‌పై కింగ్ నాగార్జున హోస్టింగ్ చేస్తుంటే.. ఇంటి స‌భ్యుల‌తో చిలౌట్ చేసేందుకు బిగ్ బాస్ ఇంట్లోకి స్వీటీ అనుష్క శెట్టి ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ట‌. స్వీటీతో పాటు నిశ్శ‌బ్ధం టీమ్ బిగ్ బాస్ ఇంట్లో ప్ర‌చార‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటుంద‌ని తెలిసింది.

అక్టోబ‌ర్ 2న నిశ్శ‌బ్ధం ఓటీటీలో రిలీజ‌వుతున్నా ఇన్నాళ్లు స‌రైన ప్ర‌చారం అయితే చేయ‌లేదు. దీనిపై ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయితే బిగ్ బాస్ 4 లో అనుష్క ప్ర‌చారంతో కాస్త‌యినా ప‌బ్లిసిటీ ద‌క్కుతుందనే భావిస్తున్నారు.

కరోనా నేపథ్యంలో ఈ సీజన్ లో బయటి వారిని లోపలికి పంపడం లేదు. వైల్డ్‌ కార్డు ఎంట్రీ ద్వారా వెళ్లే వారిని సైతం క్వారంటైన్ లో పెట్టి పరీక్షలు చేసి పంపిస్తున్నారని స‌మాచారం. ఇలాంటి స‌మ‌యంలో నిశ్శ‌బ్ధం టీమ్ లోనికి ఎంట్రీ ఇవ్వ‌డం అన్న‌ది స‌ర్ ప్రైజింగ్ ట్రీట్ అనే చెప్పాలి. ఇక ఒకే వేదిక‌పై కింగ్ నాగార్జున - అనుష్క జంట‌ను చూసి చాలా కాల‌మే అయ్యింది. ఇప్పుడు బిగ్ బాస్ అందుకు వేదిక అయితే కిక్కో కిక్కు అన‌డంలో సందేహ‌మేం లేదు.