ఫొటోటాక్ : బిబి విన్నర్ 9 ఏళ్ల క్రితం ఇలా..!

Mon Aug 02 2021 15:00:46 GMT+0530 (IST)

Life Is Beautiful Movie Throwback Memories

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో అభిజిత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కడంతో పాటు సినిమాలో నటించిన అందరికి కూడా మంచి గుర్తింపు దక్కింది. కాని వారు హీరోలుగా మాత్రం సక్సెస్ అవ్వలేక పోయారు. ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో సక్సెస్ కోసం స్టార్ డమ్ కోసం  ప్రయత్నిస్తున్న వారు ఉన్నారు. అభిజిత్ ఇటీవల బిగ్ బాస్ సీజన్ 4 విజేతగా నిలిచి మళ్లీ వార్తల్లో నిలిచాడు. హీరోగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. కరోనా కారణంగా ఆలస్యం అవుతున్న సినిమా వచ్చే ఏడాది అయినా వస్తుందనే నమ్మకంను అభిజిత్ సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. ఇక అభిజిత్ ఈ పాత ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అభిజిత్ కు మంచి స్నేహితుడు కమ్ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో మరో హీరోగా నటించిన సుధాకర్ స్నేహితుల దినోత్సవం సందర్బంగా షేర్ చేశాడు. ఎంతో మంది స్నేహితులు ఉన్నా కూడా ఇండస్ట్రీలో ఉన్న మంచి స్నేహితులు వీరే అంటూ సుధాకర్ పేర్కొన్నాడు. కుల మత సరిహద్దులు మొదలైన వాటితో సంబంధం లేకుండా సెల్రబేట్ చేసుకునే ఏకైక రోజు స్నేహితుల దినోత్సవం. ఈ రోజు కు చాలా ప్రత్యేకత ఉంది అంటూ సుధాకర్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా నాకు ఈ స్నేహితులను ఇచ్చిందని కూడా పేర్కొన్నాడు.

సుధాకర్ కూడా నటుడిగా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాడు. యూఎస్ లో ఉంటూనే సినిమాల్లో కూడా ప్రయత్నాలు చేస్తున్న సుధాకర్ ఇటీవల వరుసగా సినిమాలు మరియు వెబ్ సిరీస్ ల్లో కనిపించబోతున్నాడు. ఈ ఫొటోలో అభిజిత్ తో పాటు మిగిలిన ఇద్దరు కూడా చాలా చిన్నగా.. సన్నగా కనిపిస్తున్నారు. దాదాపుగా 9 ఏళ్ల క్రితం ఫొటో అయిన ఈ ఫొటో కు ఇప్పుడు జనాలు ఫిదా అవుతున్నారు. ఎంతైనా పాత ఫొటోలు చాలా జ్ఞాపకాలను నెమరవేసుకునేలా చేస్తాయి అనడంలో సందేహం లేదు. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి మళ్లీ ఇండస్ట్రీలో నిలిచి పోతానంటూ నమ్మకంగా ఉన్న అభిజిత్ 9 ఏళ్ల క్రితం ఇలా ఉన్నాడా అంటూ కొందరు ప్రేక్షకులు నోరు వెళ్లబెడుతున్నారు.