Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్ : మాస్‌ రాజా వారసుడి తెరంగేట్రం

By:  Tupaki Desk   |   9 Aug 2022 4:33 AM GMT
ఫస్ట్ లుక్ : మాస్‌ రాజా వారసుడి తెరంగేట్రం
X
మాస్ మహారాజా రవితేజ తనయుడు వెండితెర అరంగేట్రం ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఆ లోపు రవితేజ మేనల్లుడు మాధవ్ భూపతిరాజు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. మామయ్య ఆశీర్వాదంతో మాధవ్‌ హీరోగా 'ఏయ్‌ పిల్లా' సినిమా తో ఎంట్రీ ఇచ్చేందుకు గాను సిద్ధం అయ్యాడు. ఈ సినిమా కు లుదీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాకు రవితేజ కి సన్నిహితుడు.. ప్రముఖ దర్శకుడు అయిన రమేష్‌ వర్మ కథను అందించడం జరిగింది. రమేష్ వర్మ కథ తో ఈ సినిమా ను లుదీర్ తెరకెక్కిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్‌ లుక్ విడుదల చేయడం జరిగింది. లవ్ కమ్ రొమాంటిక్ జోనర్‌ లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్ సినిమాపై ఆసక్తి కలిగేలా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

రవితేజ మేనల్లుడు అవ్వడం వల్ల మాధవ్‌ సినిమా కి మంచి బజ్ క్రియేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమా మీడియం గా ఉన్నా కూడా మాధవ్ కి మంచి భవిష్యత్తు లభించే అవకాశాలు ఉన్నాయంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మాధవ్‌ మాస్‌ కమ్ రొమాంటిక్ లుక్ లో మామయ్య రవితేజ పోలికలు కలిగి ఉంటాడని.. మామయ్య లాగే సక్సెస్‌ అవుతాడని యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

ఈ సినిమాకి మిక్కీ జే మేయర్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆయన పాటలతో పాటు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాను గతంలో పలు సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా లో హీరోయిన్ ఆ మిస్ ఇండియా రన్నర్‌ రుబల్ షెకావత్ నటిస్తోంది. త్వరలోనే సినిమా విడుదల విషయమై క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.