Begin typing your search above and press return to search.

అవార్డ్‌ విన్నింగ్ డైరెక్టర్‌ 'దహిణి'

By:  Tupaki Desk   |   23 Oct 2021 6:30 AM GMT
అవార్డ్‌ విన్నింగ్ డైరెక్టర్‌ దహిణి
X
పలు షార్ట్ ఫిల్మ్స్ మరియు డాక్యుమెంటరీలు సినిమాలను తెరకెక్కించి పలు జాతీయ అవార్డులను దక్కించుకున్న దర్శకుడు రాజేష్ టచ్‌ రివర్. ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమా'దహిణి'. జేడీ చక్రవర్తి మరియు తన్నిష్ట ఛటర్జీ ప్రథాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా లో ఒక సామాజిక అంశంను చూపించబోతున్నారు. ఇప్పటి వరకు పలు జాతీయ అవార్డలు దక్కించుకున్న దర్శకుడు రాజేష్‌ టచ్ రివర్ మరో సారి అలాంటి సినిమానే తెరకెక్కిస్తున్నాడు. విమర్శకుల ప్రశంసలు.. అవార్డులు రివార్డులతో పాటు సమాజంలో మార్పు తీసుకు వచ్చే సినిమా అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసిన టీమ్ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ను చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న దహిణి సినిమా పూర్తిగా ఒరిస్సా లోని మయూర్ అనే జిల్లాలో తెరకెక్కించడం జరిగింది. సినిమా చిత్రీకరణ సమయం నుండే ఎన్నో విమర్శలు.. ఎన్నో వివాదాలు ఈ సినిమా చుట్టు చేరాయి. ఈ సినిమా కథ చెప్పిన సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కూడా ఆశ్చర్యపోయారట. మన చుట్టు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయా అంటూ యూనిట్‌ సభ్యులు ఎలా అయితే ఆశ్చర్యపోయారో ప్రేక్షకులు కూడా అలాగే సినిమా చూస్తున్న సమయంలో షార్ అవుతారట. సామాజిక కార్యకర్తలుగా మంచి పేరు దక్కించుకున్న సునీత కృష్ణన్‌ మరియు ప్రదీప్‌ నారాయణ్‌ ఈ సినిమాను నిర్మించడం జరిగింది.

ఈ సినిమా కథ పూర్తిగా మంత్ర విద్యలు చేస్తున్నారనే ఉద్దేశ్యంతో జరిగే హత్యల చుట్టు తిరుగుతుంది. ఇండియాలో ప్రతి ఏడాది మంత్ర విద్య నేర్చుకున్నారు.. మంత్రాలు చేస్తున్నారనే నెపంతో వంద నుండి 130 మంది వరకు హత్య కాబడుతున్నారు. ఒడిశా లో ఈ దారుణాలు ఎక్కువగా జరిగినట్లుగా స్వయంగా నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో ప్రకటించింది. అందుకే దహిణి సినిమాను అక్కడ పూర్తిగా తెరకెక్కించినట్లుగా చెబుతున్నారు. సమాజంలో ఉన్న ఈ మూడ నమ్మకం గురించి దర్శకుడు తనదైన శైలిలో వివరించేందుకు సిద్దం అయ్యాడు. ఒక మంచి కాన్సెప్ట్‌ తో వచ్చిన దర్శకుడు రాజేష్‌ టచ్‌ రివర్‌ కు ఈ సినిమాతో మరో అవార్డు దక్కుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.