ఫస్ట్ లుక్: కుక్కర్ ఆవిరి.. అమ్మాయి కళ్ళు

Wed Sep 11 2019 16:08:19 GMT+0530 (IST)

Aviri First Look

మన టాలీవుడ్ లో విభిన్న చిత్రాలను రూపొందించే దర్శకుల్లో రవిబాబు ఒకరు. తక్కువ బడ్జెట్ తో సినిమాలు పూర్తి చేయడం.. ప్రయోగాలు చేయడం రవిబాబుకు అలవాటు. అయితే ఈమధ్య రవి బాబు తెరకెక్కించిన చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను మెప్పించడం లేదు.  అయినా రవిబాబు ఆ ఫలితాలతో నిరాశపడకుండా మరోసారి డిఫరెంట్ ఫిలిం తో ప్రేక్షకులకుందుకు రానున్నారు.రవిబాబు దర్శకత్వంలో ప్రస్తుతం 'ఆవిరి' అనే సినిమా తెరకెక్కుతోంది.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.  రవిబాబు ఎప్పుడు తన సినిమాల ఫస్ట్ లుక్ విడుదల చేసినా ఆ పోస్టర్ ఆసక్తి రేకెత్తించేలా ఉంటుంది.  ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా అలానే ఉంది.  ఒక గ్యాస్ స్టవ్ పైన ప్రెజర్ కుకర్.. కింద మంట ఉంది.  కుక్కర్ మూత కాస్త పైకి ఉంటే ఆ గ్యాప్ నుండి ఆవిరి వస్తూ ఉంది.  ఆ గ్యాప్ లో కుక్కర్ లోపల ఒక అమ్మాయి ఫేస్ కనిపిస్తోంది.  ఫేస్ అంతా కాకుండా జస్ట్ కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి.  ఆ కళ్ళలో ఏదో భయం కనిపిస్తోంది.  సినిమా కథ... థీమ్ గురించి ఈ పోస్టర్ ద్వారా చెప్పేందుకు రవిబాబు ప్రయత్నించాడేమో కానీ అదేమీ పెద్దగా అర్థం కావడం లేదు.  మీకు అర్థం అయితే చక్కగా అర్థం చేసుకోండి.

ఈ థ్రిల్లర్ లో లీడ్ యాక్టర్స్ అందరూ కొత్తవారే.  భరణి శంకర్.. శ్రీ ముక్త.. నేహా చౌహాన్.. ముక్తార్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.  ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేస్తుండడంతో ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.