Begin typing your search above and press return to search.

అవికా ల‌వ్ లైఫ్..ప్రియుడు తెచ్చిన మార్పు ఏంటో?

By:  Tupaki Desk   |   28 Jun 2022 8:38 AM GMT
అవికా ల‌వ్ లైఫ్..ప్రియుడు తెచ్చిన మార్పు ఏంటో?
X
అవికాగోర్-మిలింద్ చ‌ద్వానీ ప్రేమ వ్య‌వ‌హారం బ‌హిర్గ‌త‌మే. ఈ విష‌యాన్ని అవికా స్వ‌యంగా వెల్ల‌డిచింది. రిలేష‌న్ షిప్ లో ఉన్న‌ప్పుడు దాప‌రికాలు దేనికి.. పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు ప్రియుడు గురించి చెప్ప‌డంలో సిగ్గేముంది? అంటూ అవికా విష‌యాన్ని లీక్ చేసింది. ప్ర‌స్తుతం మిలింద్ చ‌ద్వానీ ప్రేమ‌లో మునిగి తేలుతోంది అమ్మ‌డు.

కొంత మంది ప్రేమ కాలం గ‌డిచే కొద్ది బ‌ల‌హీన‌ప‌డుతుంది..కానీ అవికా-మిలింద్ ప్రేమ మాత్రం అంత‌కంత‌కు బ‌ల‌ప‌డుతుంది. ప్ర‌స్తుతం అవికాగోర్ అణువ‌ణువునా మిలింద్ ఉన్నాడు. ప్రియుడు గురించి త‌లుచుకోనిదే `డే` మొద‌ల్ల‌వ‌డం లేదు. అత‌ని ఆలోచ‌న‌లు నిర‌తరం వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అవికా -మిలింద్ ప్రేమ ఎంత బ‌లంగా ఉందో చెప్పే ప్ర‌య‌త్నం క‌నిపిస్తుంది.

``వ్యక్తిగత జీవితం చాలా సంతృప్తిగా ఉంది. మిలింద్‌తో ప్రేమ ప్రయాణం బాగుంది. నేను బరువు తగ్గడం నుంచి.. నిర్మాతగా మారడం వరకూ నా ప్రతి అడుగులో మిలింద్ తోడుగా చిలిచాడు. నా గురించి అన్ని తెలుసుకొని.. నేనేం చేయగలనో తెలుసుకునేలా! చేసి నాకు మరింత సపోర్ట్ గా నిలిచాడు. తన పరిచయం తర్వాత నాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింద‌ని` తెలిపింది.

ప్ర‌తీ మ‌గాడి స‌క్సెస్ వెనుక ఓ స్ర్తీ ఉంటుంది అంటారు. ఇక్క‌డీ వాఖ్యం మీనింగ్ కాస్త ఛేంజ్ గానే క‌నిపిస్తుంది. అవికాగోర్ న‌టిగా స‌క్సెస్ అయిన త‌ర్వాత మిలింద్ త‌న జీవితంలోకి వ‌చ్చాడు. అవికా లైఫ్ ని మ‌రింత క‌ల‌ర్ ఫుల్ గా మార్చాడు. మిలింద్ రాకతో అమ్మ‌డిలో కాన్పిడెన్స్ లెవ‌ల్స్ పెరిగాయి. ఆత్మ విశ్వాసం కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రెష్ థాట్స్ మైండ్ ని మ‌రింత శ‌క్తివంతంగా మారుస్తాయి.

సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాల‌కు ఛాన్స్ ఉంటుంది. అవికా జీవితంలోకి మిలింద్ వ‌చ్చిన‌ త‌ర్వాత ఆ రేంజ్ లో అవికా షైన్ అయిన‌ట్లు క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం అవికా `టెన్త్‌ క్లాస్‌ డైరీస్` అనే సినిమాలో న‌టిస్తోంది. తెలుగులో న‌టిస్తోన్న చేస్తోన్న ఒకే సినిమా ఇది. ఆశ‌ల‌న్ని ఈ సినిమాపైనే.

ఇప్ప‌టికే అమ్మ‌డిపై టాలీవుడ్ లో ఫేడ్ అవు ట్ అనే ముద్ర‌ ప‌డిపోయింది. `టెన్త్ క్లాస్ డైరీస్` తో స‌క్సెస్ అందుకుంటే త‌ప్ప ఆ ట్యాగ్ రిమూవ్ అవ్వ‌దు. ఇక ఖ‌జాక్ భాష‌లో `ఐ గో టూ స్కూల్` అనే సినిమాలో న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ లో `హార‌ర్స్ ఆఫ్ ది హార్ట్-1920` సినిమాలో న‌టిస్తోంది.