నిర్మాతగా యువ నాయిక తొలి అనుభవం

Wed Oct 13 2021 22:00:01 GMT+0530 (IST)

Avika Gor first experience as a producer

అందాల కథానాయిక అవికా గోర్ పరిచయం అవసరం లేదు. చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో కంబ్యాక్ అవుతున్న ఈ బ్యూటీ నిర్మాతగా తన మొదటి వెంచర్ షూటింగ్ పూర్తి చేసుకుంది. నిర్మాతగా ఉండడం వల్ల మరింత వినయపూర్వకమైన నటిగా మారానని అవిక చెబుతోంది. అవికా గోవాలో తొలి ప్రొడక్షన్ వెంచర్ కోసం షూటింగ్ లో పాల్గొంటోంది. ఇది `అద్భుతమైన అనుభవం` అని సంబరపడుతోంది.``ఇది నా మొదటి ప్రొడక్షన్ కనుక ఇది అద్భుతమైన అనుభవం. మేం గోవాలో 10 రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొన్నాం. మొత్తం లొకేషన్ లో వైబ్ చాలా విభిన్నంగా ఉంది`` అని అవిక తెలిపింది. ఇందులో ఎవరు నటిస్తున్నారు అన్న సమాచారం వెల్లడించలేదు కానీ.. నిర్మాతగా ఉండటం నన్ను మరింత వినయపూర్వకంగా మార్చిందని వెల్లడించింది.

నేను ఒక వ్యక్తిగా ఎదగడానికి ఇది సహాయపడింది. నా గురించి నేను చాలా గర్వపడుతున్నాను. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి విడుదల చేయడానికి వేచి ఉండలేను.. అని తెలిపింది. అవిక తెలుగు భాషా థ్రిల్లర్ డ్రామా `నెట్` లో కనిపించింది. తదుపరి తెలుగులో `థాంక్యూ` చిత్రంలో కనిపించనుంది. మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ సరసన ఓ చిత్రం చేస్తోంది.