ఆయనది మా నాన్న వయసు.. అలాంటాయనతోనాః హీరోయిన్

Tue Jun 22 2021 11:00:01 GMT+0530 (IST)

Avika Gor Talking About Manish Singh Roy

అవికాగోర్ అంటే.. చాలా మందికి తెలియదు. కానీ.. చిన్నారి పెళ్లికూతురు అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా టీవీ ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది అవికా గోర్. ఆ తర్వాత నటిగానూ తానేంటో నిరూపించుకుంది. ‘ఉయ్యాల జంపాల’ ‘సినిమా చూపిస్త మావా’ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి చిత్రాలతో తనదైన గుర్తింపు తెచ్చుకుంది అవికాగోర్. ఈ బ్యూటీకి ఎఫైర్స్ ఉన్నాయని చాలా ఏళ్ల నుంచే రూమర్స్ ఉన్నాయి.‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ హిందీ డబ్బింగ్ అనే సంగతి తెలిసిందే. ఈ సీరియల్ తర్వాత ‘ససురాల్ సిమర్ కా’ అనే మరో సీరియల్ లోనూ నటించింది. ఇందులో మనీశ్ రాయ్ సింఘన్ తో కలిసి పనిచేశారు. అయితే.. ఈ సీరియల్ కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య వ్యవహారం నడించిందని ఓ బిడ్డకు సైతం జన్మనిచ్చారని తెగ ప్రచారం సాగింది.

తాజాగా.. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవికా గోర్ కు ఇదే ప్రశ్న ఎదురైంది. ‘మనీష్ కు మీకు మధ్య రిలేషన్ ఉందనే ప్రచారం నిజమేనా’ అన్న ప్రశ్నకు ఆమె స్పందించారు. అది నిజం కానే కాదని అందుకు అవకాశమే లేదని చెప్పింది. ఆయన తనకు 18 సంవత్సరాల వయసు తేడా ఉందని ఆయన తన తండ్రి వయసు వాడని తెలిపింది అవికా.

అయితే.. మనీశ్ తనకు స్నేహితుడని ఆయన్నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపింది. ఇలాంటి వార్తలు తాను కూడా గతంలో చదివానని ఏకంగా బిడ్డ కూడా ఉందనే ప్రచారం జరిగిందని చెప్పింది. తొలినాళ్లలో ఈ వార్తలు విని చాలా బాధపడ్డానని ఆ తర్వాత పట్టించుకోవడం మానేసినట్టు చెప్పింది.