Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : బాబోయ్‌ ఈమె చిన్నారి కాదు వయ్యారి

By:  Tupaki Desk   |   17 May 2022 1:30 AM GMT
ఫోటోటాక్ : బాబోయ్‌ ఈమె చిన్నారి కాదు వయ్యారి
X
తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌ తో పరిచయం అయిన అవికా గౌర్ ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌ గా కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విషయం తెల్సిందే. హీరోయిన్ గా మొదటి సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకున్న అవికా ఆ తర్వాత తెలుగు లో పలు సినిమాల్లో నటించింది.

అదృష్టం కలిసి రాకపోవడంతో పాటు కాస్త ఆమద్య బరువు పెరగడం వల్ల అమ్మడి క్రేజ్ తగ్గి సినిమాల్లో ఆఫర్లు తగ్గాయి. దాంతో బరువు తగ్గి మళ్లీ సినిమాల్లో ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టింది. తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా అవకాశాల కోసం అవికా ఎదురు చూస్తోంది. ఈ సమయంలోనే ఈమె ఇన్ స్టా గ్రామ్‌ లో తెగ అందాల విందు చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంది.

అవికా గౌర్ తాజాగా రెడ్ టాప్ తో క్లీవేజ్ షో చేయడంతో పాటు నడుము అందాన్ని నాభి అందాన్ని ఎక్స్ పోజ్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. ఆ చూపులో మత్తు ఉంది.. ఆమె ప్రతి ఒక్క స్టిల్ లో కూడా ఆకర్షణ ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. అవికా గతంతో పోల్చితే రెండు మూడు రెట్ల అందంతో కనిపిస్తుందంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటి వరకు చిన్నారి పెళ్లి కూతురు అంటూ జనాల్లో గుర్తింపు ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు చిన్నారి కాదు వయ్యారి మాదిరిగా ఉందంటూ అభిమానులు కామెంట్స్‌ తో ముంచెత్తుతున్నారు. చిన్నారి పెళ్లి కూతురు ఇమేజ్ నుండి పూర్తిగా బయటకు వచ్చే విధంగా ఈ ఫోటోలు ఉన్నాయి అనడంలో సందేహం లేదు. ఈ ఫోటోలతో చిన్నారి పెళ్లి కూతురు మళ్లీ బిజీ అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.