Begin typing your search above and press return to search.

13 కిలోల బరువు తగ్గిన 23ఏళ్ల అవిక ఎమోష‌నల్ నోట్

By:  Tupaki Desk   |   29 Oct 2020 4:45 AM GMT
13 కిలోల బరువు తగ్గిన 23ఏళ్ల అవిక ఎమోష‌నల్ నోట్
X
బ‌రువు పెరగ‌డానికి ర‌క‌ర‌కాల కార‌ణాలు. థైరాయిడ్ గ్రంథితో ముడిప‌డిన వ్య‌వ‌హార‌మిది. క‌థానాయిక‌ల‌కు అయితే స‌రిగా అవ‌కాశాల్లేక న్యూన‌త‌లోకి వెళ్లినా బ‌రువు పెరిగే అవ‌కాశం ఉంటుంది. కానీ అలాంటిదేమీ కాద‌ని అంటోంది అవికా గోర్. త‌న అధిక బ‌రువు స‌మ‌స్య స‌హ‌జసిద్ధ‌మైన‌దేన‌ట‌. తాజాగా అవికా గోర్ ఇన్ స్టాలో ఈ వ్య‌వ‌హారంపై సుదీర్ఘంగానే నోట్ రాసింది.

ఈ కొద్ది గ్యాప్ లోనే దాదాపు 13 కిలోల బరువు కోల్పోయిందిట ఈ 23 ఏళ్ల బ్యూటీ. “గత సంవత్సరం ఒక రాత్రి ఘ‌ట‌న‌ నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను అద్దంలో నన్ను చూసుకున్నాక గుండె ప‌గిలింది. నేను చూసినదాన్ని నేను ఇష్టపడలేదు. పెద్ద చేతులు... కాళ్ళు.. బాగా ఊబెక్కిన బొడ్డు. నేను త‌ట్టుకోలేక‌పోయాను. ఇది అనారోగ్యం (థైరాయిడ్.. పిసిఓడి మొదలైనవి) కారణంగానే. అందుకే నేను బ‌రువు పెరిగాను. అది నా నియంత్రణలో లేదు. కానీ నేను ఏదైనా త‌ప్పు చేశానా? అంటే.. ప్రతిదీ దొరికింద‌ల్లా తిన్నందున ఇలా అయ్యింది. పైగా నేను అస్సలు వ్యాయామం చేయలేదు. మా శరీరాలు బాగా చికిత్స పొందటానికి అర్హమైనవి, కానీ నేను దానిని గౌరవించలేదు” అంటూ త‌న త‌ప్పుల్ని విశ్లేషించుకుంది అవికా.

త‌న‌ను తాను విశ్లేషించుకుని అధిక‌బ‌రువు అసురక్షితంగా భావించింద‌ట‌. ఆ త‌ర్వాతే పెనుమార్పు. న‌న్ను నేను చూసే తీరు నాకు నచ్చలేదు.. నేను డ్యాన్స్ ‌ను పూర్తిగా ఆనందించలేకపోయాను. నేను ఎలా సరిగ్గా కనిపించాలి? అంటూ బాధ‌ప‌డ్డాను. బయటివారికి నన్ను చెడుగా చూస్తార‌ని క‌ల‌త‌కు గుర‌య్యాను. ఇటువంటి అభద్రతాభావాలు అన్ని సమయాలలో నెత్తిపై శివ‌తాండ‌వ‌మాడ‌తాయి. అవి మనకు అలసట చిరాకును కలిగిస్తాయి... అంటూ చాలా విచార‌క‌ర‌మైన విష‌యాల్ని చెప్పింది.

``బ‌రువు త‌గ్గాక మాత్రం ఇప్పుడు తన చర్మంలో సుఖం ఉందని చెప్పింది, “నేను ఈ ఉదయం అద్దంలో నన్ను చూసుకున్నాను. దూరంగా చూడవలసిన అవసరం క‌ల‌గ‌లేదు. నేను నన్ను చూసి నవ్వి..., నేను అందంగా ఉన్నానని నాకు చెప్పుకున్నాను. మనందరికీ ఆఫర్లు చాలా ఉన్నాయి. మనం చేయలేని దాని గురించి విచారించ‌కుండా.. చురుకుగా పని చేయాలి. ఈ రోజు మునుప‌టిలా నేను ప్రశాంతంగా ఉన్నాను`` అంటూ కాస్త ఎమోష‌న‌ల్ గానే నోట్ రాసింది. నేను నా 100 శాతం ఇవ్వకపోయినా ప్రేక్ష‌కులు ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నారని నేను భావిస్తున్నాను. నేను వృత్తిపరంగా మంచి పని చేస్తున్నా కానీ నేను సంతోషంగా లేక‌పోవ‌డానికి బ‌రువు కార‌ణ‌మైంది. నేను శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా నా 100 శాతం బాగ‌య్యాను ఇపుడు. మ‌న‌సు బాగోన‌ప్పుడు నేను స్క్రీన్ ప్లే రాయడానికి ప్రయత్నించాను. కాని అప్పుడు నేను దానిపై దృష్టి పెట్టలేక‌పోయాను. అయితే నా పుట్టినరోజు (జూన్ 30)న నావారంద‌రికీ 100 శాతం రుణపడి ఉంటాను.. అంటూ సుదీర్ఘ ఎమోష‌న‌ల్ నోట్ ని రాసింది అవికా.