Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : ఆ చిన్నపాపే ఇంతలో ఎంత మార్పు

By:  Tupaki Desk   |   5 July 2020 11:21 AM GMT
ఫొటోటాక్‌ : ఆ చిన్నపాపే ఇంతలో ఎంత మార్పు
X
సినిమా పరిశ్రమల్లో కొన్ని కొన్ని సార్లు ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతూ ఉంటాయి. చిన్నారి పెళ్లి కూతురులో అవికా చిన్న పిల్లగా కనిపించి ఉయ్యాల జంపాల సినిమాల్లో హీరోయిన్‌ గా నటించి అందరికి షాక్‌ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ సమయంలో ఇంతలో అంత మార్పు వచ్చిందా ఇంత పెద్ద అమ్మాయిగా అవికా మారిందా అంటూ చాలా మంది నోరు వెళ్లబెట్టారు. ఇప్పుడు అదే పరిస్థితి ఎస్తేర్‌ అనిల్‌ను చూస్తుంటే కలుగుతుంది. దృశ్యం చిత్రంలో నటించిన ఎస్తేర్‌ సౌత్‌ ఆడియన్స్‌ ను విశేషంగా ఆకట్టుకుంది.

ఒరిజినల్‌ దృశ్యంతో పాటు తెలుగు దృశ్యంలో కూడా వెంకటేష్‌ చిన్న కూతురుగా ఎస్తేర్‌ నటించింది. ఆ సినిమా 2014 సంవత్సరంలో వచ్చింది. ఆ సినిమా వచ్చి సరిగ్గా ఆరు సంవత్సరాలు అయ్యింది. ఆ సినిమాలో చిన్న పాపగా కనిపించిన ఎస్తేర్‌ ఇప్పుడు అంటే ఆరు సంవత్సరాల తర్వాత చూస్తే హీరోయిన్‌ రేంజ్‌ లో కనిపిస్తుంది.

ఇంతలో అంత మార్పా అన్నట్లుగా ఎస్తేర్‌ లుక్‌ మార్చేసింది. చీర కట్టి హోయలు కురిపిస్తూ క్యూట్‌ పాప కాస్త హాట్‌ పాపగా మారిపోయింది. ఈ అమ్మడు హీరోయిన్‌ గా నటించేందుకు రెడీ అయ్యింది. 18 ఏళ్ల ఎస్తేర్‌ కు ప్రస్తుతం యంగ్‌ స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తున్నాయట. త్వరలోనే ఈమె హీరోయిన్‌ గా తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చేనేమో చూడాలి.