అబ్బురపరుస్తున్న 'అవతార్ 2' కాన్సెప్ట్ పోస్టర్స్..

Wed Sep 15 2021 13:08:43 GMT+0530 (IST)

Avatar 2 Concept Posters

హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ సృష్టించిన గ్రాఫిక్ వండర్ ''అవతార్''. 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించి.. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేసింది. ఈ విజువల్ వండర్ అన్ని దేశాలతో పాటుగా ఇండియాలోనూ భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఒక దశాబ్దానికి పైగా ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'అవతార్' నిలవగా.. 2019లో 'అవెంజర్స్ -ఎండ్ గేమ్' ఆ రికార్డుల్ని బ్రేక్ చేసింది. అయితే చైనాలో రీ-రిలీజ్ కలెక్షన్స్ తో మళ్ళీ వరల్డ్ నెం.1 గా 'అవతార్' అవతరించింది.ఈ అద్భుత సృష్టికి సీక్వెల్ గా మరో నాలుగు సినిమాలు రెడీ చేయనున్నట్లు దర్శకుడు జేమ్స్ కేమరూన్ ఇది వరకే ప్రకటించారు. ప్రస్తుతం ''అవతార్ 2'' సినిమా వర్క్ చేస్తున్నారు. అందులో భాగంగా అవతార్ పార్ట్-2 కోసం రెడీ చేసిన కొన్ని కాన్సెప్ట్ ఆర్ట్ ఇమేజెస్ ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. స్టన్నింగ్ గా ఉన్న ఈ పోస్టర్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఫస్ట్ పార్ట్ కు మించి 'అవతార్-2' విజువల్ వండర్ గా రూపొందుతోందని ఈ కాన్సెప్ట్ పోస్టర్స్ చూస్తే అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ ఇమేజెస్ నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా ''అవతార్ 2'' కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా లేట్ అవుతూ వస్తోంది. బిగ్గెస్ట్ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రంగా రూపొందుతోన్న 'అవతార్-2'.. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2022 డిసెంబర్ 16న విడుదల కానుంది. ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఇకపోతే 'అవతార్-3' చిత్రాన్ని 2024 డిసెంబర్ లో.. 'అవతార్-4' ని 2026 డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు. ఇక చివరి భాగం 'అవతార్-5' ను 2028 డిసెంబర్ లో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.