Begin typing your search above and press return to search.

డెబ్యూతోనే పాన్ ఇండియాని టార్గెట్ చేస్తున్న యాటిట్యూడ్ స్టార్..!

By:  Tupaki Desk   |   7 Oct 2022 3:53 AM GMT
డెబ్యూతోనే పాన్ ఇండియాని టార్గెట్ చేస్తున్న యాటిట్యూడ్ స్టార్..!
X
బుల్లితెర మెగాస్టార్ గా పిలవబడే సీనియర్ నటుడు ప్రభాకర్.. సీరియల్స్ మరియు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ప్రభాకర్ ఇటీవల తన కుమారుడు చంద్రహాస్ ను హీరోగా లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తొలి సినిమా రిలీజ్ అవ్వకుండానే మనోడు తన యాటిట్యూడ్ మరియు ట్రోలింగ్ తోనే ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు.

చంద్రహాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ మధ్య చిన్నపాటి ఈవెంట్ ఏర్పాటు చేసిన ప్రభాకర్.. తనయుడిని హీరోగా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు అందరికీ తెలియజేసారు. ఈ సందర్భంగా ప్రభాకర్ తన కొడుకు గురించి మాట్లాడుతుంటే.. పక్కనే ఉన్న చంద్రహాస్ విచిత్రమైన హావభావాలు ఇస్తూ కనిపించాడు.

చంద్రహాస్ వైఖరితో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. నెటిజన్లు అతనిపై మీమ్స్ క్రియేట్ చేసి నెట్టింట ఓ ఆట ఆడుకున్నారు. చాలామంది అతని ఫోటోని డీపీగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో డెబ్యూ మూవీ ప్రేక్షకుల ముందుకు రాకముందే 'యాటిట్యూడ్ స్టార్' అనే ట్యాగ్ కూడా ఇచ్చేశారు.

ఇంటర్నెట్ లో ట్రోలింగ్ కారణంగా తనయుడు పాపులర్ అవడంపై ప్రభాకర్ కూడా పాజిటివ్ గానే స్పందించారు. అతను నిలబడిన స్టైల్ నచ్చలేదు ట్రోల్ చేశారు.. సినిమా బాగుండి యాక్టింగ్ బాగా చేస్తే వాళ్లే పోగొడుతారు. ఎలా అయితేనేం వాడికి పాపులారిటీ వచ్చింది.. చంద్రహాస్ గురించి జనాలకు తెలిసింది.. బాగా నటిస్తే వాళ్లే నెత్తిన పెట్టుకుంటారు అని ప్రభాకర్ అన్నారు.

చంద్రహాస్ మరియు చిత్ర బృందం సైతం ఈ ట్రోలింగ్ ని పాజిటివ్ గా తీసుకొని.. సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైరికల్ గా పెట్టిన 'యాటిట్యూడ్ స్టార్' అనే ట్యాగ్ ని తన స్క్రీన్ నేమ్ కు తగిలించుకోవడం విశేషం.

చంద్రహాస్ డెబ్యూ చిత్రానికి ''బ్లాక్ డాగ్ ఫర్ వైట్ చిక్'' అనే ఇంగ్లీష్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. లేటెస్టుగా ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ని 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి చేతుల మీదుగా గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇందులో చంద్రహాస్ పేరు ముందు 'Attitude Star' అనే బిరుదును వేయడం గమనార్హం. ఇక టీజర్ లోనూ ప్రభాకర్ కొడుకు ఓ రేంజ్ లో యాటిట్యూడ్ చూపించాడు.

''అరేయ్ బామ్మర్దీ.. మన ఎంట్రీ గురించి కంట్రీ మొత్తం మాట్లాడాలని గట్ల కొట్టినా..'' అంటూ హైదరాబాదీ కుర్రాడి స్లాంగ్ లో ఒక డైలాగ్ చెప్పాడు చంద్రహాస్. అంతేకాదు స్టార్ హీరోల రేంజ్ లో యాక్షన్ సీన్ తో ఆశ్చర్య పరిచాడు. స్మైల్ మరియు వాకింగ్ స్టైల్ లోనూ తన వైఖరి తెలియజేశాడు.

ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే.. చంద్ర హాస్ తన డెబ్యూ మూవీతోనే పాన్ ఇండియాని టార్గెట్ చేయడం. ''బ్లాక్ డాగ్ ఫర్ వైట్ చిక్'' చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నట్లు సూచిస్తూ అన్ని భాషల్లోనూ టైటిల్ ను ప్రకటించారు.

టాలీవుడ్ స్టార్ కిడ్స్ ఎవరూ కూడా తెరంగేట్రంతో పాన్ పాన్ ఇండియాని లక్ష్యంగా చేసుకోలేదు. కానీ ఇప్పుడు ప్రభాకర్ తనయుడు ట్రోలింగ్ తో వచ్చిన పాపులారిటీని జాతీయ స్థాయిలో పెంచుకోవాలని చూస్తున్నాడు. మరి ఈ యాటిట్యూడ్ స్టార్ ను జనాలు ఏ విధంగా ఆదరిస్తారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.