బాద్ షా ఫ్యాన్స్ కు మన డైరెక్టర్ డబుల్ ధమాకా

Fri Jul 01 2022 08:00:01 GMT+0530 (IST)

Atlee kumar to Direct Bollywood Badshah

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమా లు రూపొందుతున్నాయి. విడుదల కూడా బ్యాక్ టు బ్యాక్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత దశాబ్ద కాలంగా షారుఖ్ ఖాన్ కు సాలిడ్ సక్సెస్ లేదు. ఆ విషయం ను ఏ ఒక్క ఫ్యాన్ కూడా కాదనలేడు. ఒకప్పుడు షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన సినిమా అంటే కళ్లు మూసుకుని ఆలోచించకుండా వెళ్ళ వచ్చు అనే పరిస్థితి ఉండేది. కాని ఇప్పుడు ఆలోచించి వెళ్లాలి అన్నట్లుగా పరిస్థితి ఉంది.షారుఖ్ వరుస ప్లాప్ లతో దాదాపుగా నాలుగు సంవత్సరాల గ్యాప్ తీసుకున్నాడు. ఎట్టకేలకు పఠాన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ పక్కా కమర్షియల్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అంటూ అభిమానులు మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ఒక వైపు పఠాన్ సినిమా కుమ్మేస్తుందని నమ్మకం తో ఉన్న షారుఖ్ ఖాన్ అభిమానులు మరో వైపు సౌత్ కమర్షియల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న జవాన్ సినిమా గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఈ రెండు సినిమా లు కూడా షారుఖ్ స్థాయిని పూర్వ వైభవం అన్నట్లుగా తీసుకు వెళ్లడం ఖాయం అంటూ బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు.

అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న జవాన్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్లుగా ఇటీవల వచ్చిన టీజర్ ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. హీరోగా షారుఖ్ ఖాన్ కు పఠాన్ మరియు జవాన్ సినిమా లు అత్యంత కీలకంగా ఉన్నాయి. కనుక ఈ రెండు సినిమాల గురించి చాలా ఎగ్జైట్ గా ఉన్నారు.

జవాన్ సినిమా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు వెబ్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత కొన్నాళ్లుగా షారుఖ్ దక్కించుకోని కమర్షియల్ హిట్ ఈ సినిమా తో దక్కబోతుంది అంటున్నారు.

షారుఖ్ ఖాన్ ను ద్వి పాత్రాభినయం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో షూటింగ్ ప్రారంభం అయిన జవాన్ సినిమాను వచ్చే ఏడాది పట్టాలెక్కించే అవకశం ఉంది.