ఏడాది చివరిలో స్టార్ హీరో కుమార్తె పెళ్లి

Fri May 13 2022 11:13:34 GMT+0530 (IST)

Athiya Shetty marriage year ending

నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ని కలిగి ఉంది. ఇక క్రికెటర్ కం ప్రియుడితో చెట్టాపట్టాల్ అంటూ షికార్లు చేస్తూ ఆ ఫోటోలను షేర్ చేస్తుంటే దాంతోనూ బోలెడంత ఫాలోయింగ్ పెరిగింది. ఈ అందాల నాయిక తరచుగా ఇన్ స్టాగ్రమ్ లో తన ఆకర్షణీయమైన రూపాన్ని షేర్ చేస్తూనే ఉంది. ఆమె ప్రియమైన వారిని అభిమానులను విస్మయానికి గురి చేస్తుంది.ప్రతిసారీ షేర్ చేసినట్టే ఈసారి కూడా ఇన్ స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేయగా అభిమానులు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కేవలం కొన్ని గంటలలో అథియా `గ్రామ్`లో కొన్ని అందమైన స్నాప్ లను షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. తన ఫోటోలకు ప్రియుడు కె.ఎల్.రాహుల్ కూడా వెంటనే స్పందించాడు.

ఆతియా ఫోటోలను పోస్ట్ చేసిన వెంటనే ప్రియుడు క్రికెటర్ కెఎల్ రాహుల్ దానిపై స్పందించి ఆమె ఫోటోను లైక్ చేశారు. అతనితో పాటు సునీల్ శెట్టి - రిద్ధిమా కపూర్ సాహ్ని- కరిష్మా కపూర్ - కియారా అద్వానీ తదితరులు కూడా ఆ ఫోటోలకు లైక్ కొట్టారు. ఆమె అభిమానులు కూడా కామెంట్ సెక్షన్ లో స్వీట్ కామెంట్స్ ని పోస్ట్ చేసారు. ఒక అభిమాని అద్భుతం అని రాశాడు. మరొక వినియోగదారు “Wowwwwwww” అని వ్యాఖ్యానించారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. సునీల్ శెట్టిని తన కుమార్తె వివాహంపై పుకార్ల గురించి అడిగారు. దీనిపై స్పందించిన ప్రముఖ నటుడు అతియా శెట్టి తన కూతురనీ.. ఆమెను ఎప్పుడో పెళ్లి చేసుకోవాలని కోరానని చెప్పాడు. తన కొడుకుకు కూడా పెళ్లి చేయాలని ఎంత త్వరగా జరిగితే అంత మంచిదని ఆయన అన్నారు.

భాగస్వామి ఎంపికను తన పిల్లలకు వదిలేశానని తెలిపాడు. కెఎల్ రాహుల్ గురించి మాట్లాడుతూ.. తాను ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నానని సునీల్ వెల్లడించాడు. పెళ్లి గురించి వివరిస్తూ - “కాలం మారినందున వారు ఏమి చేయాలనుకుంటున్నారో వారు నిర్ణయించుకుంటారు. నా కుమార్తె మరియు కొడుకు ఇద్దరూ బాధ్యతగల వ్యక్తులు.. వారు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి” అని అన్నారు.

ఇంతలోనే అతియా - KL రాహుల్ ల వివాహానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయని .. ఈ సంవత్సరం చివరి నాటికి వారు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ జంట సౌత్ ఇండియన్ వెడ్డింగ్ స్టైల్లో వేడుకను కూడా జరుపుకోనున్నట్లు సమాచారం. ఈ సెలబ్రిటీ వివాహం గురించి అభిమానులు ఉత్సుకతతో ఉన్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.