టాప్ లేపేస్తున్న స్టార్ డాటర్..తట్టుకోవడం కష్టమే..!

Fri Oct 23 2020 23:00:01 GMT+0530 (IST)

Top Daughter Star Daughter .. Hard To Tolerate ..!

స్టార్ హీరో సునీల్ శెట్టి టాలీవుడ్ కి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు నటిస్తున్న మోసగాళ్లు చిత్రంలో విలన్ గా నటించనున్నాడు. ఇంతకుముందు అతడు సూపర్ స్టార్ రజనీకాంత్ - మురుగదాస్ కాంబినేషన్ మూవీ దర్బార్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా విలనీ ఇరగదీసిన సంగతి తెలిసిందే. దర్బార్ లో సునీల్ శెట్టి విలనీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందుకే అతడు టాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు అనగానే ఒకటే క్యూరియాసిటీ నెలకొంది. ఓవైపు కేజీఎఫ్ 2తో సంజయ్ దత్ సౌత్ కి పరిచయం అవుతుంటే సునీల్ శెట్టి ఇక్కడ వరుసగా అవకాశాలు అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు.ఇకపోతే సునీల్ శెట్టి గారాల తనయ అతియా శెట్టి గురించి పరిచయం అవసరం లేదు. టీమిండియా ట్యాలెంటెడ్ క్రికెటర్ కె.ఎల్ రాహుల్ తో చెట్టాపట్టాల్ అంటూ షికార్లు చేస్తున్న ఆథియా అతడిని పెళ్లాడబోతోందని ప్రచారం సాగుతోంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్న బాలీవుడ్ నటీమణులలో అతియా శెట్టి ఒకరు.నిరంతరం తన దినచర్యతో అభిమానులను అప్‌డేట్ చేయడం తనకో హాబీ. ఆమె తరచూ అద్భుతమైన ఫోటోలను వీడియోల్ని పంచుకుంటుంది. ఇంతకుముందు ఇన్ స్టెంట్ కాఫీ తయారు చేయడమెలానో వీడియోని పోస్ట్ చేసి ఆకట్టుకుంది. ఇప్పుడు ఏకంగా టాప్ లేపేస్తూ ఉన్న ఓ ఫోటోని షేర్ చేసింది.

ఎంతో వదులుగా ఉండే టోర్టిల్లా బ్రౌన్ కలర్ టాప్ ధరించి టాప్ లేపేసే పోజిచ్చింది ఆథియా. ఇక ఆథియా పేరు ఇటీవల నెపోటిజం జాబితాలోకి డ్రాగ్ చేయబడిన సంగతి తెలిసినదే. సుశాంత్ సింగ్ మరణానంతర సీక్వెన్సులో అథియా ఆమె సోదరుడు అహాన్ పేరు కూడా స్వపక్షరాజ్యం చర్చల్లోకి లాగారు నెటిజనం.

నవాజుద్దీన్ సిద్దిఖీతో అతియా చివరి చిత్రం మోటిచూర్ చక్నాచూర్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాలేదు. `హీరో` అనే చిత్రంతో 2015 లో సూరజ్ పంచోలితో కలిసి బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ముబారకన్- నవాబ్ జాదే వంటి చిత్రాల్లో నటించింది. అతియా చివరిసారిగా మోటిచూర్ చక్నాచూర్ లో కనిపించింది.