తొలి ఫోటో: స్టార్ డాటర్ తో కేఎల్ రాహుల్ పెళ్లి

Mon Jan 23 2023 22:03:54 GMT+0530 (India Standard Time)

Athiya Shetty And Kl Rahul Wedding Pics

ఎట్టకేలకు అతియా శెట్టి- కేఎల్ రాహుల్ పెళ్లి చేసుకున్నారు! సునీల్ శెట్టి తన కుమార్తె అతియా శెట్టి - క్రికెటర్ KL రాహుల్ వివాహం ఖండాలా ఫామ్ హౌస్ లో జరిగినట్లు ధృవీకరించారు. ఖండాలా నుండి కొన్ని ఫోటోలు విజువల్స్ సోషల్ మీడియాల్లోకి వచ్చాయి. ప్రస్తుతం పెళ్లి మూడ్ లో హ్యాపీగా ఉన్న ఈ జంట వివాహ వేడుక నుండి అధికారిక ఫోటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారాయి.అతియా - రాహుల్ సంయుక్తంగా షేర్ చేసిన ఫోటోలలో కొత్త జంట ఆనందంతో మురిసిపోతూ కనిపించారు. అభిమానులు - స్నేహితులు ఈ జంట పోస్ట్ కు అభినందన సందేశాలతో హుషారు ప్రదర్శించారు. ఈ వివాహానంతరం సునీల్ శెట్టి తన కొడుకు అహన్ తో కలిసి బయటికి వచ్చి మీడియా ఫోటోగ్రాఫర్లతోను మాట్లాడాడు. ఐపీఎల్ తర్వాత రిసెప్షన్ ఉంటుందని సునీల్ శెట్టి ప్రకటించారు. సునీల్ - అహన్ ఫోటోగ్రాఫర్లకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఆకాంక్ష రంజన్ కపూర్- ఆదిత్య సీల్ -అనుష్క రంజన్ కపూర్- దర్శకుడు జెపి దత్తా- డయానా పెంటీ- కృష్ణ ష్రాఫ్ తదితరులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో పలువురు రాజకీయ ప్రముఖులు కనిపించారు. ఆథియా శెట్టి కొన్నేళ్లుగా కే.ఎల్.రాహుల్ తో ప్రేమలో ఉంది. సినీకెరీర్ కి బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ ఎట్టకేలకు పెళ్లితో ఓ ఇంటిదైంది. వివాహానంతరం నటిస్తుందా లేదా? అన్నది వేచి చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.