కోలీవుడ్ హీరో పరిస్థితేంటి?

Tue Sep 17 2019 07:00:02 GMT+0530 (IST)

Atharva in Varun Tej valmiki

తమిళ్ లో సూపర్ హిట్  'జిగర్తాండ' కు రీమేక్ గా తెరకెక్కిన 'వాల్మీకి' ఈ నెల 20 న థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సినిమాలో వరుణ్ నెగిటివ్ రోల్ లో కనిపిస్తుండగా అధర్వ పాజిటీవ్ రోల్ లో నటించాడు. తమిళ్ లో అధర్వ క్యారెక్టర్ ను సిద్దార్థ్ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ఒరిజినల్ లో హీరో మీదే సినిమా నడుస్తుంది. అక్కడ బాబీ సిన్హా పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్నప్పటికీ సిద్దార్థ్ పాత్రతోనే సినిమాను నడిపించాడు కార్తీక్ సుబ్బరాజు.అయితే తెలుగుకి వచ్చే సరికి హరీష్ శంకర్ వరుణ్ కోసం కొన్ని మార్పులు చేసాడు. వరుణ్ నెగిటివ్ క్యారెక్టర్ మాత్రమే హైలైట్ అయ్యేలా జాగ్రత్త తీసుకున్నాడు. అందులో భాగంగానే తెలుగు హీరోను కాకుండా కోలీవుడ్ హీరో అధర్వ ను తీసుకున్నారు. ఒక రకంగా ఈ సినిమా ఈ కుర్ర హీరోకి తెలుగు డెబ్యు అనే చెప్పాలి. తెలుగులో డబ్బింగ్ సినిమాలతో వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. అందుకే 'వాల్మీకి'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాడు.

కానీ ఇంత వరకూ అధర్వ ఎందుకో ప్రమోషన్స్ లో కనిపించనేలేదు. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా అధర్వ ఎటెండ్ అవ్వలేదు. అసలు అతనికి మేకర్స్ నుండి పిలుపు అందిందో లేదో కూడా తెలియదు.  యూనిట్ కూడా పోస్టర్స్ లో ఎక్కడో తప్ప అధర్వ స్టిల్ ఎక్కువగా వాడట్లేదు. మొదటి నుండి వరుణ్ నే హైలైట్ చేస్తూ వస్తున్నారు. ఇక ఈ సినిమా తనకి తెలుగులో పేరు తెస్తుందని భావిస్తున్న ఈ కోలీవుడ్ హీరో హైలైట్ అవుతాడా లేదా చూడాలి. ఈ సినిమాతో తెలుగులో మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్న అధర్వ ఏ మారకూ సక్సెస్ అవుతాడో చూడాలి.