గద్దలకొండకు అదొక్కటే మైనస్

Sat Sep 21 2019 10:35:35 GMT+0530 (IST)

Atharva Role in Varun Tej Gaddalakonda Ganesh Movie

నిన్న విడుదలైన గద్దలకొండ గణేష్ కు మాస్ నుంచి బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతోంది. మెగా ఫాన్స్ అంచనాలకు తగ్గట్టే దర్శకుడు హరీష్ శంకర్ ఇందులో మసాలాలను కూర్చిన తీరు ఆ వర్గం వారిని బాగా ఆకట్టుకుంటోంది. వరుణ్ తేజ్ రిస్క్ చేసిన నెగటివ్ షేడ్స్ క్యారెక్టర్ ఇప్పటిదాకా కాదు ఇకపై కూడా కెరీర్ బెస్ట్ గా నిలుస్తుందని అభిమానుల మాట. ఇదిలా ఉండగా అన్ని సరిగ్గానే కుదిరిన ఈ సినిమాలో అథర్వా పాత్ర గురించి మాత్రం సంతృప్తి వ్యక్తం కాలేకపోతోంది. కారణం లేకపోలేదుఅధర్వ మనకు ఏ మాత్రం పరిచయం లేని మొహం. ఇంతకు ముందు ఒకటే డబ్బింగ్ సినిమా వచ్చింది కానీ దాన్నెవరూ పట్టించుకోలేదు. అలాంటప్పుడు ఇంత కీలక పాత్రకు అతన్ని తీసుకోవడం కొంత మైనస్ గానే నిలిచింది. సాధారణ ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోతున్నారు . ఒకవేళ ఎవరైనా తెలుగు హీరోనో లేదా ఫామ్ లో లేని తెలిసిన మోహాన్నో తీసుకుని ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ దక్కేది.

అన్ని విషయాల్లోనూ జాగ్రత్త తీసుకున్న హరీష్ శంకర్ ఈ సెలక్షన్ లో మాత్రం రాజీ పడినట్టుగా కనిపిస్తోంది. దానికి తోడు విలన్ పాత్రలకు బాగా మ్యాచ్ అయ్యే హేమచంద్ర గొంతుతో అధర్వకు డబ్బింగ్  చెప్పించడం చాలా సీన్స్ లో ఎబ్బెట్టుగా అనిపించింది. ఈ లోపాలన్నీ వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్ తో హరీష్ శంకర్ కామెడీ టైమింగ్ తో కవరైపోయాయి కానీ లేదంటే రిజల్ట్ ఇంకోలా ఉండేదేమో. సైరా వచ్చే దాకా ఇంకే అపోజిషన్ గద్దలకొండ గణేష్ కు లేకపోవడంతో రెండు వారాలు పండగ చేసుకునే ఛాన్స్ ఉంది