Begin typing your search above and press return to search.

లేలేత వన్నెల.. అందాల కోమల..!!

By:  Tupaki Desk   |   5 July 2020 3:39 AM GMT
లేలేత వన్నెల.. అందాల కోమల..!!
X
కొందరు హీరోయిన్లను చూస్తే నిజంగా అందగత్తెలకు కూడా అసూయ కలిగేంత అందంగా ఉంటారు. ఎందుకంటే అంత అందంగా ఉంటారు మరి ఆ బ్యూటీలు. అలాంటి అసూయ కలిగించే అందగత్తెలలో ఒకరు అనన్య పాండే. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే యంగెస్ట్ హీరోయిన్. ఫస్ట్ సినిమా నుండి వరుస విజయాలతో దూసుకుపోతుంది అమ్మడు. తను నటించిన రెండు సినిమాలు హిట్స్ కావడంతో అనన్య ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం ఎదురు చూస్తోంది. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2’, ‘పతి పత్ని ఔర్‌ వో’ చిత్రాల్లో తన గ్లామర్‌ తళుకులతో మెరుపులు మెరిపించి బాలీవుడ్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇక ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన పాన్ ఇండియా మూవీలో నటిస్తుంది ఈ లేత బ్యూటీ. మొత్తానికి ఈ సినిమా పై భారీ ఆశలే పెట్టుకుందట. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన అనన్య పాండే.. తాజాగా సోషల్ మీడియాలో తన అందాలతో సెగలు పుట్టిస్తోంది. అమ్మడు మాట్లాడుతూ.. "స్టూడెంట్ అఫ్ ద ఇయర్-2 తో హీరోయిన్ గా పరిచయమైన నేను ఆ సినిమాతో హిట్ కొట్టా.. ఆ తర్వాత 'పతి పత్ని ఔర్ హో' సినిమాతో మరో హిట్ అందుకున్నా.. అయితే హ్యాట్రిక్ హిట్ గురించి పెద్దగా ఒత్తిడి లేదని" చెబుతుంది అనన్య.

బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకు తనుగా సెపెరేట్ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక సోషల్ మీడియాలో అనన్యకి మిలియన్లలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అమ్మడి పోస్టుల కోసం ఫ్యాన్స్ ఎగబడి ఎదురు చూస్తుంటారు. తాజాగా పోస్ట్ చేసిన ఇంస్టాగ్రామ్ ఫోటోలో అమ్మడు అలా సోయగాల పాన్పు పై సున్నితంగా వాలినట్లు పోజిచ్చింది. ఆ మత్తెక్కించే చూపులు.. ఎర్ర గులాబిల్లాంటి పెదాలు కుర్రకారు మతి పోగొడుతుంది. "లేలేత వన్నెల.. అందాల కోమల" అంటూ నెటిజన్లు వర్ణిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.