‘సర్కారువారి పాట’ టీజర్ అప్పుడేనా? అసిస్టెంట్ డైరెక్టర్ హింట్!

Thu Apr 22 2021 14:00:02 GMT+0530 (IST)

Assistant Director Hint On Sarkaru Vaari Paata Teaser

సూపర్ స్టార్ మహేష్ అప్ కమింగ్ మూవీ ‘సర్కారువారి పాట’. కరోనా తొలిదశ ఫ్రీ అయిన తర్వాత దుబాయ్ లో మొదలైందీ చిత్రం. ఆ షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాలతోపాటు ఒక సాంగ్ ఇంకా కొన్ని యాక్షన్ ఛేజింగ్ ఎపిసోడ్లు షూట్ చేశారు. ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చింది యూనిట్.ఇప్పుడు.. హైదరాబాద్ లో ఈ షూట్ కొనసాగుతోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కొన్నాళ్లు ఇంట్లోనే ఉన్న మహేష్.. ఈ చిత్రం కోసం రిస్క్ తీసుకొని సెట్లో అడుగు పెట్టాడు. త్రివిక్రమ్ తో సినిమా దాదాపుగా కన్ఫామ్ అయిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని త్వరగా కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నాడట.

వచ్చే ఏడాది రాజమౌళితో సినిమా ఉన్న నేపథ్యంలో సర్కావారి పాటను త్వరగా ముగించి త్రివిక్రమ్ సినిమాను వేంగా పట్టాలెక్కించే లక్ష్యంతో పనిచేస్తున్నాడు మహేష్. నిజానికి ఈ షూట్ మొత్తం ఆగస్టు నాటికి కంప్లీట్ చేయాలని మొదట లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ.. ఇప్పుడు మరింత ముందుగా ఫినిష్ చేయాలని చూస్తోంది.

అయితే.. ఇప్పటి వరకూ ఈ చిత్రానికి సంబంధించి మహేష్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాలేదు. కేవలం టైటిల్ ను మాత్రమే చూపించారు. అలాంటిది.. త్వరలో టీజర్ రాబోతోందన్న హింట్స్ అందుతున్నాయి. ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న యువ నటి స్వప్నిక సోషల్ మీడియా వేదికగా టీజర్ గురించి మాట్లాడింది.

ఇటీవల ఇన్ స్టా ఫాలోవర్లతో క్వశ్చన్ అవర్ నిర్వహించింది స్వప్నిక. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘‘సర్కారువారి పాట టీజర్ మే 31న ఎక్స్ పెక్ట్ చేయొచ్చా?’’ అని అడగ్గా.. ‘చేయొచ్చేమో’ అని సమాధానం ఇచ్చింది. మరో ప్రశ్నకు కూడా ఇదే హిట్ ఇచ్చింది స్వప్నిక. దీంతో.. అదే రోజున టీజర్ వస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఆ డేట్ స్పెషాలిటీ ఏమంటే.. అది సూపర్ స్టార్  కృష్ణ పుట్టిన రోజు. మరి ఆ రోజున టీజర్ వస్తుందో లేదో చూడాలి.