పచ్చబొట్టుతో పవన్ ఫ్యాన్స్ ను బాగానే ఆకట్టుకుంది

Mon Jul 13 2020 12:00:45 GMT+0530 (IST)

Ashu Reddy Reveals FACTS about Inking Pawan Kalyan Tattoo

టాలీవుడ్ హీరోల్లో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలువురు యంగ్ స్టార్ హీరోలు హీరోయిన్స్ సెలబ్రెటీలు కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల జాబితాలో ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. జూనియర్ సమంతగా పేరు దక్కించుకున్న అషు రెడ్డి పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే విషయం తెల్సిందే. ఆమె పలు సందర్బాల్లో పవన్ పై తనకున్న అభిమానంను చెప్పింది. తన ప్రైవేట్ ప్లేస్ లో టాటూ వేయించుకుని తన అభిమానంను నిరూపించుకుంది.పవన్ అభిమాని అవ్వడంతో అషు రెడ్డి పవన్ ఫ్యాన్స్ అభిమానం సొంతం చేసుకుంది. పవన్ ఫ్యాన్స్ ఈమెను సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలో అవుతున్నారు. దాదాపుగా ఏడు లక్షల మంది ఇన్ స్టా ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్ట్ లు పెట్టడంతో పాటు పవన్ పై తనుకున్న అభిమానంను షేర్ చేసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ అషు రెడ్డి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ దక్కించుకుంది.

పవన్ కళ్యాణ్ కు తాను అభిమానిని కాదు భక్తురాలిని అంటూ ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య పవన్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే ఆమెను పవన్ అభిమానులు తెగ ఫాలో అవుతూ ఉన్నారు. మొత్తానికి పవన్ పేరు ఉపయోగించుకుని నెట్టింట మంచి ఫాలోవర్స్ ను దక్కించుకుంది. బుల్లి తెరపై అప్పుడప్పుడు సందడి చేస్తున్న అషు వెండి తెర అరంగేట్రం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.