Begin typing your search above and press return to search.

అషురెడ్డికి వ‌ర్మ పాద పూజ‌..ఇదేం ఘోరం?

By:  Tupaki Desk   |   7 Dec 2022 5:14 AM GMT
అషురెడ్డికి వ‌ర్మ పాద పూజ‌..ఇదేం ఘోరం?
X
రాంగోపాల్ వ‌ర్మ‌- అషురెడ్డి ఎపిసోడ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌ధ్య ఓ బోల్డ్ ఇంట‌ర్వ్యూతో సంచ‌ల‌న రేపిన జోడీ అది. అటుపై ప‌బ్ లో ఇద్ద‌రు ప్ర‌యివేట్ స్పేస్ గురించి తెలిసిందే. అషు రెడ్డి అందాల కోసం వ‌ర్మ కెమెరా మ్యాన్ అయిపోయాడు. ఆ త‌ర్వాత బ్యూటీ అందాల్ని త‌న వ్య‌క్తిగ‌త కెమెరాలోనూ బంధించాడు. అదే స‌మ‌యంలో తొడ‌ల మీద చేయి వేసి నెమిరే ప్ర‌య‌త్నం చేసాడు.

స‌రిగ్గా అప్పుడే లాగి పెట్టి లెంప‌కాయ లాగేస‌రికి చ‌టుక్కున ఆ మ‌త్తు లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. అప్ప‌టి నుంచి వ‌ర్మ‌-అషు ఏం చేసినా? అది సంచ‌ల‌న‌మే అవుతుంది. తాజాగా అషురెడ్డికి వ‌ర్మ పాద పూజ‌తో పాటు..థాయ్ మ‌సాజ్ కూడా చేసిన‌ట్లు హైలైట్ అవుతుంది. ఇద్ద‌రు జంట‌గా ఉన్న కొన్ని ఫోటోలిప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

అందులో ఓ ఫోటోలో అషురెడ్డి ప‌సుపు వ‌ర్ణం స్కిన్ టైట్ తొడ‌ల వ‌ర‌కూ వేసుకుని సోఫాలోకూర్చుని ఉంది. ఆమెకి ఎదురుగా వ‌ర్మ నెత్తికి క్యాప్.. బ్లాక్ టీష‌ర్లు ధ‌రించి ఆమె పాద‌ల వ‌ద్ద కూర్చుని ఉన్నాడు. మ‌రో ఫోటోలోపాదాల‌కు మ‌సాజ్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తున్నాడు. ఇంకో ఫోటోలో అవే అంద‌మైన పాదాల్ని జిహ్వ‌తో జుర్రేస్తున్నాడు.

అషురెడ్డి థై పై పుట్టు మ‌చ్చ‌ని సైతం క్లోజ‌ప్ షాట్ లో చూపించారు. ఆక్లోజ్ అప్ తీయ‌డం వెనుక కార‌ణంగా కూడా ఆ పుట్టు మ‌చ్చ అన్న‌ది గ్ర‌హించాల్సిన విష‌యం. ఆ ప‌క్క‌నే టేబుల్ పై ఆ జంట‌కిష్ట‌మైన అన్ని బ్రాండ్ లు క‌నిపిస్తున్నాయి. ఇది అధికారికంగా లీక్ చేసిన ఫోటోలు. వీటిని ఉద్దేశించి వ‌ర్మ ఓ హాట్ క్యాప్స‌న్ కూడా ఇచ్చాడు.

`డబుల్ డేంజరస్` అషు రెడ్డితో నాకు ప్రమాదకరం` అని ఆ చిత్రానికి క్యాప్షన్ ఇచ్చాడు. దీనికి నెటి జ‌నులు అదిరిపోయే కామెంట్లు పెడుతున్నారు. మా భ‌యం నీ గురించే వ‌ర్మా? అషురెడ్డి తో నీకు పెద్ద ప్ర‌మాదామే పొంచి ఉంది? అంటూ కామెంట్లు పెడుతున్నారు. కేవ‌లం పాద పూజేనా? లేక ఇంకేమైనా స్వామి పూజ‌లు జ‌రిగాయా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.