చైతు కోసం అశ్రిత.. వైరల్ వీడియో..!

Tue Dec 06 2022 22:24:00 GMT+0530 (India Standard Time)

Ashrita At NagaChaitanya Shoyu Restaurent

విక్టరీ వెంకటేష్ చిన్న కూతురు అశ్రిత దగ్గుబాటి సొంతంగా ఒక ఫుడ్ వ్లాగర్ నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఫుడ్ వ్లాగర్ గా అశ్రిత స్టార్ట్ చేసిన ఇన్ఫినిటీ ప్లాటర్ భారీ సబ్ స్క్రిప్షన్ సంపాదించుకుంది. ఫుడ్ లవర్స్ అందరికి ప్రపంచంలో ఉన్న టేస్టీ ఫుడ్స్ పరిచయం చేస్తూ వాటిపై తన రివ్యూ అందిస్తుంది అశ్రిత. అంతేకాదు తన ఛానెల్ లో ఏదైనా ఫుడ్ ఐటెం గురించి చెబితే అది కచ్చితంగా ది బెస్ట్ అనిపించుకుంటుంది. అలా ట్రాక్ రికార్డ్ సంపాదించిన అశ్రిత ఇనాళ్లు తన పనేదో తను చేసుకుంటూ వచ్చింది. తాజాగా అక్కినేని హీరో నాగ చైతన్య కోసం ఒక స్పెషల్ వీడియో చేసింది అశ్రిత.    ఓ పక్క సినిమాలు చేస్తూ బిజినెస్ చేయడం ఈ తరం హీరోలకు చాలా కామన్ అయ్యింది. సినిమాల్లో వచ్చిన కొంత మొత్తాన్ని బిజినెస్ లో పెడితే ఏదో ఒక టైం లో అవి తమకు హెల్ప్ అవుతాయని భావిస్తున్నారు.

టాలీవుడ్ స్టార్స్ అంతా ఇప్పటికే ఏదో ఒక సైడ్ బిజినెస్ చేస్తూనే ఉన్నారు. వారి దారిలోనే నాగ చైతన్య ఫుడ్ లవర్స్ కోసం షోయు అనే క్లౌడ్ కిచెన్ ని స్థాపించారు. అక్కడ రకరకాల రుచి గల వంటకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిపై అశ్రిత ఇన్ఫినిటీ ప్లాటర్ రివ్యూ ఇచ్చింది. బావ బిజినెస్ కి సపోర్ట్ గా కూడా తన వీడియో చేసింది అశ్రిత.            

షోయు క్లౌడ్ కిచెన్ లోని వెరైటీ డిసెష్ ని టేస్ట్ చేస్తూ వాటి గురించి చెప్పుకొచ్చింది అశ్రిత. తను ఇప్పటివరకు సొంతంగా ఎలాంటి వీడియోస్ చేసినా సెలబ్రిటీస్ ని ఎప్పుడూ టచ్ చేయని అశ్రిత మొదటిసారి నాగ చైతన్య కోసం ఈ స్పెషల్ వీడియో చేసింది.

అయితే ఈ వీడియో వల్ల అశ్రితకు లాభమని చెప్పొచ్చు. ఇన్నాళ్లు తన వ్లాగర్ గురించి కేవలం కొంతమందికే తెలియగా నాగ చైతన్య తో చేసిన ఈ స్పెషల్ ఎపిసోడ్ వల్ల సినీ ప్రేక్షకులకు కూడా అశ్రిత వ్లాగర్ గురించి తెలిసే ఛాన్స్ ఉంది.  

దగ్గుబాటి అక్కినేని ఫ్యామిలీల మధ్య రిలేషన్ గురించి అందరికి తెలిసిందే. ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే వరుస హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న చైతన్య థ్యాంక్యూ నిరాశపరచగా ప్రస్తుతం వెంకట్ ప్రభుతో కస్టడీ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.