Begin typing your search above and press return to search.

ఈ పిల్ల తో కష్టం, కానీ నాకు చాలా ఇష్టం

By:  Tupaki Desk   |   19 Jan 2022 1:14 PM GMT
ఈ పిల్ల తో కష్టం, కానీ నాకు చాలా ఇష్టం
X
విశ్వ‌క్ సేన్ న‌టిస్తున్న సరికొత్త చిత్రం `అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం`. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న‌మైన చిత్రాల్లో న‌టిస్తున్నారు విశ్వ‌క్ సేన్‌. `పాగ‌ల్` మూవీ త‌రువాత ఆయ‌న వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ నాలుగు చిత్రాల‌ని లైన్ లో పెట్టారు. అందులో ఒక‌టే `అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం`. విభిన్న‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో విశ్వ‌క్ సేన్ కు జోడీగా రుక్సార్ థిల్లాన్, రుతికా నాయ‌క్ న‌టిస్తున్నారు.

విద్యా సాగ‌ర్ చింత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రానికి ర‌వి కిర‌ణ్ కోల క‌థ అందిస్తున్నారు. ఎస్ వీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్ పై బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో బాపినీడు, సుధీర్ ఈద‌ర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇందులో హీరో విశ్వ‌క్ సేన్ వ‌డ్డీ వ్యాపారం చేసే అర్జున్‌ కుమార్ అల్లంగా విభిన్న‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నారు.

సంక్రాంతి సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి ఓ ఆస‌క్తిక‌ర‌మైన వీడియోని మేక‌ర్స్ రిలీజ్ చేశారు. అర్జున్‌ కుమార్ అల్లంకు పిల్ల దొరికింది అంటూ రిలీజ్ చేసిన వీడియో సినిమాపై ఆస‌క్తిని రేకెత్తించింది. అంతే కాకుండా ఈ వీడియోలో గోప‌రాజు ర‌మ‌ణ ప‌లికిన సంభాష‌ణ‌లు కూడా ఆక‌ట్టుకున్నాయి.

`దొరికింది.. దొరికింది.. అర్జున్ కుమార్ అల్లం కు పిల్ల దొరికిందోచ్ .. అంటూ విడుద‌లైన వీడియో ఆక‌ట్టుకోవ‌డ‌మే కాకుండా విశ్వ‌క్ సేన్ కు ఈ సారి హిట్ గ్యారెంటీ అనే సంకేతాల్ని అందించింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ సింగిల్ ని మేక‌ర్స్ బుధ‌వారం విడుద‌ల చేశారు. `ఓ ఆడ‌పిల్లా .. న‌వువ్ర్థం కావా.. నా జీవితంతో ఆటాడుతావా... అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేశారు.

ఈ పాట‌ని అనంత శ్రీ‌రామ్ రాశారు. జ‌య‌కృష్ణ సంగీతం అందించిన ఈ పాట‌ని రామ్ మిర్యాల ఆల‌పించారు. మెలోడీ ప్ర‌ధానంగా సాగే ఈ పాట ఆక‌ట్టుకుంటోంది. విభిన్న‌మైన క‌థ‌తో పెళ్లి కోసం ఎదురుచూసే ఓ యువ‌కుడి క‌థ‌గా రూపొందుతున్న ఈ మూవీ కోసం హీరో విశ్వ‌క్ సేన్ కొంత బ‌రువు పెరిగారు. అంతే కాకుండా మేకోవ‌ర్ ప‌రంగానూ చాలా కొత్త‌గా క‌నిపించేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.

లిరిక‌ల్ వీడియోని షేర్ చేసి హీరో విశ్వ‌క్ సేన్ `ఈ పిల్ల తో కష్టం, కానీ నాకు చాలా చాలా ఇష్టం` అని కామెంట్ చేస్తే .. హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ `ఆడపిల్ల అంటే ఆ మాత్రం ఉంటాది మరి` అని కామెంట్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది.