హీరో కావడానికి అశోక్ గల్లా కష్టాలు!

Wed Nov 13 2019 12:09:07 GMT+0530 (IST)

Ashok Galla struggles to become a hero

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా డెబ్యూ సినిమా కు ఈమధ్యే పూజా కార్యక్రమాలు జరిగాయి.  శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయట కు వచ్చింది.  సహజంగా డెబ్యూ హీరో సినిమా అనగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్  లేదా లవ్ స్టొరీ ప్లాన్ చేస్తారు. కానీ ఈ సినిమాలో అలా పూర్తిగా లవ్ స్టొరీ ఉండదట.ఈ సినిమా కథ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య గత చిత్రాల స్టైల్ లోనే విభిన్నం గా ఉంటుందట.  ఈ సినిమాకు నేపథ్యం కూడా ఇంట్రెస్టింగ్  గా ఫిలిం ఇండస్ట్రీని ఎంచుకున్నారట.  అశోక్ గల్లా ఈ సినిమా లో హీరో కావాలనే ప్రయత్నాలు చేసే యువకుడి లా కనిపిస్తాడట. ఆయితే అవకాశాల కోసం స్ట్రగుల్ అయ్యే సమయం లో ఒక క్రైమ్ లో ఇరుక్కు పోతాడని.. దాని నుంచి ఎలా బయటకు వచ్చాడు.. హీరో కావాలనే తన గమ్యాన్ని చేరుకున్నాడా లేదా అనేది మిగతా కథ అని సమాచారం.  బేసిక్ స్టొరీలైన్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉందని అనిపిస్తోంది. మరి ఈ పాయింట్ ను ఆడియన్స్ ను థ్రిల్ అయ్యేలా శ్రీరామ్ ఆదిత్య ఎలా ప్రెజెంట్ చేస్తాడో వేచి చూడాలి.

ఈ సినిమా లో అశోక్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది.  జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. అమర్ రాజా ఎంటర్టైన్మెంట్ & మీడియా బ్యానర్ పై ఈ సినిమాను పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు.