Begin typing your search above and press return to search.

#హీరో.. జాయ్ ఫుల్ గా బ‌రిలోకొస్తున్నాడు

By:  Tupaki Desk   |   15 Oct 2021 6:15 AM GMT
#హీరో.. జాయ్ ఫుల్ గా బ‌రిలోకొస్తున్నాడు
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ మేన‌ల్లుడు.. ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ - ప‌ద్మ దంప‌తుల వార‌సుడు అశోక్ గల్లా హీరోగా ఆరంగేట్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని సూప‌ర్ స్టార్ కృష్ణ‌-గ‌ల్లా అరుణ‌కుమారి స‌మ‌ర్ప‌ణ‌లో గ‌ల్లా పద్మావ‌తి నిర్మిస్తున్నారు. అమ‌ర్ రాజా ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఇంత‌కుముందు గ‌ల్లా వార‌సుడు అశోక్ ఫ‌స్ట్ లుక్ ఆక‌ట్టుకుంది. పోస్ట‌ర్ల‌లో స్మార్ట్ అప్పియ‌రెన్స్ తో యూత్ కి క‌నెక్ట‌య్యాడు. ఈ సినిమాలో అశోక్ .. సినిమా ల‌వ‌ర్ గా క‌నిపించ‌బోతున్నారు. శ్రీ‌రామ్ ఆదిత్య ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నిధి అగ‌ర్వాల్ ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

నేడు ద‌స‌రా సంద‌ర్భంగా చిత్ర‌బృందం కొత్త పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది. పోస్ట‌ర్ లో `హీరో` జోష్ ఫుల్ గా క‌నిపిస్తున్నాడు. ఎన‌ర్జిటిక్ స్టార్ లా డ్ర‌మ్స్ ని వాయిస్తూ జాయ్ తో అల‌రిస్తున్నాడు. ఈ న‌వంబ‌ర్ లో సినిమాని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. వ‌కీల్ సాబ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని తెర‌కెక్కించిన శ్రీ‌రామ్ ఆదిత్య డెబ్యూ హీరోని ఏ రేంజులో ఎలివేట్ చేయ‌నున్నారో చూడాలి.