Begin typing your search above and press return to search.

సెల్ఫీష్ అవ్వ‌బోతున్న ఆషీష్ రెడ్డి

By:  Tupaki Desk   |   20 Jan 2022 8:59 AM GMT
సెల్ఫీష్ అవ్వ‌బోతున్న ఆషీష్ రెడ్డి
X
దిల్ రాజు ఫ్యామిలీ నుంచి శిరీష్ త‌న‌యుడు ఆశిష్ రెడ్డి హీరోగా ప‌రిచ‌యం అయిన విష‌యం తెలిసిందే. ఆశిష్ హీరోగా తెరంగేట్రం చేసిన చిత్రం `రౌడీ బాయ్స్‌`. శ్రీ‌హ‌ర్ష కొనుగంటి డైరెక్ట్ చేశారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి జ‌న‌వ‌రి 14న విడుద‌లై అనూహ్య విజ‌యాన్ని సాధించింది. హీరోగా ఆశిష్ రెడ్డికి మంచి పేరు తెచ్చిపెట్టింది. దిల్ రాజు మాసీవ్ ప్ర‌మోష‌న్స్ ఈ సినిమాకు, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ఆశిష్ రెడ్డిల లిప్ లాక్ యూత్ లో ఈ మూవీకి భారీ క్రేజ్ ని తెచ్చిపెట్టాయి.

దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి మంచి హిట్ అనిపించుకుంది. సంక్రాంతి సీజ‌న్ కావ‌డంతో తొలి ఐదు రోజుల్లో ఈ మూవీ 7 కోట్ల గ్రాస్ ని 4 కోట్ల షేర్ ని రాబ‌ట్టింద‌ని స్వ‌యంగా దిల్ రాజు వెల్ల‌డించారు. ఈ మూవీ ఇచ్చిన స‌క్సెస్ జోష్ లో వున్న దిల్ రాజు తాజాగా ఆశిష్ రెడ్డి నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టించేశారు. `సెల్ఫీష్‌` పేరుని ఈ ప్రాజెక్ట్ కి ఫైన‌ల్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు కాశి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నారు. ఈ మూవీకి సుకుమార్ క‌థ‌ని అందించ‌డ‌మే కాకుండా వ‌న్ ఆఫ్ ది ప్రొడ్యూస‌ర్ గా కూడా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. దీంతో సుకుమార్ క‌థ‌తో మ‌రోసారి వార‌సుడిని దిల్ రాజు రీలాంఛ్ చేయ‌బోతున్నారంటూ వార్త‌లు షికారు చేస్తున్నాయి. సుకుమార్ శిష్యులు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌ని అందిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇటీవ‌ల `ఉప్పెన‌`తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన సుకుమార్ శిష్యుడు సానా బుచ్చిబాబు నూత‌న ద‌ర్శ‌కుడిగా రికార్డు సృష్టించిన విష‌యం తెలిసిందే. తొలి చిత్రాన్నే 100 కోట్ల క్ల‌బ్ లో చేర్చ‌డంతో సుక్కు శిష్యుల‌పై టాలీవుడ్ లో క్రేజ్ ఏర్ప‌డింది. దీంతో మ‌రో శిష్యుడు కాశీ చేయ‌బోతున్న `సెల్ఫీష్‌` పై కూడా భారీ అంచ‌నాలు ఏర్ప‌డిన‌ట్టుగా చెబుతున్నారు. విభిన్న‌మైన టైటిల్ లో రాబోతున్న ఈమూవీకి సంబంధించిన మ‌రిన్ని వివార‌లు త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నార‌ట‌.