Begin typing your search above and press return to search.

సిగ‌రెట్ తాగ‌డ‌మెలానో ప్రాక్టీస్ చేస్తున్న నాట‌కి..!

By:  Tupaki Desk   |   15 Oct 2020 1:30 AM GMT
సిగ‌రెట్ తాగ‌డ‌మెలానో ప్రాక్టీస్ చేస్తున్న నాట‌కి..!
X
ఉత్త‌రాది హాటీ అషిమా నర్వాల్ దూకుడు ఇటీవ‌ల హాట్ టాపిక్ గా మారింది. ఈ అమ్మ‌డు టాలీవుడ్ లో వేడెక్కించే పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చేందుకు ఎంత‌మాత్రం వెన‌క‌డుగు వేయ‌బోద‌ని స్ప‌ష్ఠ‌మైంది. సిడ్నీ యూనివ‌ర్శిటీ ఆఫ్ టెక్నాల‌జీలో చ‌దువుకున్న ఈ అమ్మ‌డికి వేడెక్కించే టెక్నిక్ మా బాగా తెలుసున‌ని తొలి సినిమాతోనే ప్రూవ్ చేసింది.

2018లో నాట‌కం అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. న‌టించిన తొలి సినిమాతోనే ఆక‌ట్టుకుంది. క‌వ్వించే అందం.. మ‌త్తు చ‌ల్లే మిస‌మిస‌లు ఈ అమ్మ‌డికి పెద్ద ప్ల‌స్ అయ్యాయి. ఆ త‌ర్వాత జెస్సీ.. కోలైగ‌ర‌న్ .. రాజ‌భీమ వంటి చిత్రాల‌కు సంత‌కాలు చేసింది. ఇందులో రాజ‌భీమ (త‌మిళం) చిత్రీక‌ర‌ణ‌లో ఉంది. 2020 ని పెద్ద‌గానే ప్లాన్ చేసినా అన్నిటికీ క‌రోనా చెక్ పెట్టేసింది.

అయితే ఈ లాక్ డౌన్ స‌మ‌యాన్ని వేస్ట్ చేసుకోకుండా ఇదిగో ఇలా సోషల్ మీడియాల్లో కొన్ని ఆకర్షణీయమైన స్నాప్ ‌లతో హీట్ పెంచేస్తోంది. వీటితో స‌ద‌రు యువ నటికి మంచి ఫాలోయింగ్ పెరిగింది. తాజాగా న‌ర్వాల్ కొత్త వీడియోలలో ఒకటి వైరల్ గా మారింది. వీడియోలో అషిమా నార్వాల్ సిగరెట్ తాగుతూ..బాలయ్య ఫేమ‌స్ డైలాగ్ “డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్” చెబుతోంది. అషిమా ఈ డైలాగ్ ను స్టైలిష్ గానే ప‌లికింది. సిగ‌రెట్ తాగ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అన్న స్లోగ‌న్ చెబుతూనే హైద‌రాబాద్ రోడ్ల‌పై తిర‌క్కండి అని కూడా చెప్పింది ఇన్ స్టా వ్యాఖ్యానంలో. త‌దుప‌రి చిత్రంలో త్వరలో నటించబోయే పాత్రపై పట్టు సాధించడానికి మాత్రమే తాను ధూమపానం చేస్తున్నానని అషిమా తన తాజా సందేశంలో పేర్కొంది.