Begin typing your search above and press return to search.

ఆ హీరోతో వెళ్లిపోవాల‌ని ఆశ‌గా ఉందిః న‌టి

By:  Tupaki Desk   |   16 Jun 2021 10:30 AM GMT
ఆ హీరోతో వెళ్లిపోవాల‌ని ఆశ‌గా ఉందిః న‌టి
X
ర‌ణ్ బీర్ క‌పూర్.. బాలీవుడ్ లో హ్యాండ్స‌మ్ హీరో. ఎంతో మంది అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు. అయితే.. సాధార‌ణ ఫ్యాన్స్ కే కాదు.. త‌న‌కు కూడా అత‌నంటే పిచ్చి అంటోంది బుల్లితెర న‌టి ఆషా నేగి. హిందీ టీవీ న‌టిగా ఆషా నేగీ చాలా పాపుల‌ర్‌. చాలా సీరియ‌ల్స్ లో లీడ్ రోల్స్ చేసింది. క్ర‌మంగా వెండి తెర‌వైపు అడుగులు వేస్తోంది.

ఈ బ్యూటీ న‌టించిన ''క్వాంబోంకే ప‌రిందే'' అనే వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ స్టోరీ ఏమంటే.. ఓ వ్యాన్ జ‌ర్నీ చుట్టూ న‌డుస్తుంది. ఆశ నేగితోపాటు మ‌రికొంద‌రు ఆ వ్యాన్ లో ప్ర‌యాణిస్తుంటారు. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నుంచి పెర్త్ కు సాగే ప్ర‌యాణమే ఈ వెబ్ సిరీస్ క‌థ‌. ఈ జ‌ర్నీలో ఎన్నో అంద‌మైన లొకేష‌న్ల వ‌చ్చి పోతుంటాయి.

అయితే.. ఇలాంటి జ‌ర్నీని రియ‌ల్ లైఫ్ లో చేయాల‌ని, అది కూడా త‌న ఆల్ టైమ్ హ్యాండ్స‌మ్ హీరో ర‌ణ్ బీర్ తో క‌లిసి లాంగ్ డ్రైవ్ వెళ్లాల‌ని ఆశ‌ప‌డుతోంది నేగి. త‌న‌కు ప్ర‌కృతి అంటే ఎంతో ఇష్ట‌మ‌ని చెబుతున్న ఈ బ్యూటీ.. ర‌ణ్ బీర్ తో క‌లిసి కొండ‌లు, గుట్ట‌లు ఎక్కేస్తూ ఆస్వాదించాల‌ని కోరిక‌గా ఉంద‌ట‌. ఈ వెబ్ సిరీస్ ప్ర‌మోష‌న్ కోసం ఈ వ్యాఖ్య‌లు చేసిందో.. లేక నిజంగానే మ‌న‌సులో ఉన్న‌మాట‌లో తెలియ‌దుగానీ.. మొత్తానికి బ‌య‌ట పెట్టేసింది. మ‌రి, ఈ ఆఫ‌ర్ కు ర‌ణ్ బీర్ ఏమంటాడో..?