Begin typing your search above and press return to search.

వ్యాక్సినేష‌న్లో అంత బిల్డ‌ప్ అవ‌స‌ర‌మా? - హీరోయిన్‌

By:  Tupaki Desk   |   13 May 2021 2:30 AM GMT
వ్యాక్సినేష‌న్లో అంత బిల్డ‌ప్ అవ‌స‌ర‌మా? - హీరోయిన్‌
X
ప‌బ్లిసిటీ చాలా మంది వీక్నెస్. ఏదో విధంగా జ‌నాలు త‌మ‌ను చూసి ఆహా.. ఓహో అనాల‌ని కోరుకుంటారు. అది మ‌రికొంద‌రికి చిరాకు తెప్పిస్తుంది. ఇప్పుడు కొవిడ్ టీకాలు తీసుకుంటూ అంద‌రూ ఫొటోలు క్లిక్ మ‌నిపిస్తుండ‌డం.. దాన్ని తీసుకొచ్చి సోష‌ల్ మీడియాలో అప్ లోడ్ చేయ‌డం.. లైకులు, కామెంట్లు రిసీవ్ చేసుకోవ‌డం జ‌రుగుతున్న‌దే.

అయితే.. కొంద‌రు మాత్రం మొద‌ట్లో జ‌నాల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు చేశారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు భ‌య‌ప‌డే స‌మ‌యంలో తాము తీసుకున్నామ‌ని, మీరు కూడా తీసుకోండ‌ని చెప్పారు. అయితే.. ఇప్పుడు జ‌నాల్లో భ‌యం పోయింది. ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ దొరుకుతుందా? అనే కండీష‌న్లోకి వ‌చ్చేశారు. ఇలాంటి స‌మ‌యంలోనూ ప‌లువురు సెల‌బ్రిటీలు ఫొటోలు షేర్ చేస్తున్నారు.

కాగా.. కొంద‌రు మాత్రం వ్యాక్సిన్ తీసుకునేప్పుడు ఓవ‌రాక్ష‌న్ చేస్తున్నార‌ని అంటున్నారు. తాజాగా ఇదే విష‌య‌మై న‌టి ఆశా నేగి సెటైర్లు వేసింది. కొంద‌రు సెల‌బ్రిటీల ఓవ‌రాక్ష‌న్ చూడ‌లేక‌పోతున్నా అని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. మ‌రీ అంత ఓవ‌ర్ యాక్టింగ్ అవ‌స‌రం లేద‌ని, అది చాలా చిరాకు పుట్టిస్తోంద‌ని ఇన్ స్టాలో రాసుకొచ్చింది.

అయితే.. ఇది ఎవ‌రి గురించి అయి ఉంటుంద‌న్న‌ది చాలా మందికి అర్థం కాలేదు. కొంద‌రు మాత్రం ఆరాతీశారు. ఈ కామెంట్ న‌టి అంకిత లోఖండే గురించేన‌ని అంటున్నారు. ఇటీవ‌ల వ్యాక్సిన్ తీసుకున్న ఆమె.. ఎంతో భ‌య‌ప‌డిపోయి, కేక‌లు కూడా పెట్టింది. ఆ త‌ర్వాత‌ ఈ వీడియోను షేర్ చేసింది. సో.. ఆశా నేగి సెటైర్ అంకిత గురించేన‌ని అనుకుంటున్నారు. 'ప‌విత్ర రిస్తా' సీరియల్స్ లో వీరిద్దరూ కో-స్టార్స్ కావడం గమనార్హం.