మాస్ట్రో మరింత మందికి చేరువ కానున్నాడట!

Fri Sep 24 2021 11:04:05 GMT+0530 (IST)

As Maestro gets closer to more people

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అంధాదున్ ను తెలుగు లో మాస్ట్రో గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. నితిన్ హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా తమన్నా ముఖ్య పాత్రలో నటించిన మాస్ట్రో సినిమా ను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడం జరిగింది. సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నితిన్ నటన పరంగా మంచి మార్కులు దక్కించుకోవడంతో పాటు తమన్నా మరియు నితిన్ ల కాంబోలో వచ్చిన సన్నివేశాలకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. అంధాదున్ ను హిందీ ప్రేక్షకులు ఆధరించినట్లుగానే ఓటీటీ లో తెలుగు ప్రేక్షకులు మాస్ట్రోను తెగ చూస్తున్నారు. తమన్నా క్రేజ్ మరియు ఇతర విషయాల కారణంగా ఈ సినిమాను ఓటీటీలో కాకుండా థియేటర్ల ద్వారా విడుదల చేసి ఉంటే ఖచ్చితంగా మంచి వసూళ్లు నమోదు అయ్యేవి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మాస్ట్రో ను మలయాళం మరియు తమిళంలో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.అంధాదున్ తమిళ రీమేక్ ను ఇప్పటికే మొదలు పెట్టారు. సీనియర్ హీరో ప్రశాంత్ ప్రధాన పాత్రలో ఈ రీమేక్ రూపొందుతోంది. త్యాగరాజన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఏ సమయంలో అయినా విడుదల అయ్యే అవకాశం ఉంది. తమన్నా కనిపించిన పాత్రను అక్కడ సిమ్రాన్ పోషించింది.. ఇక హీరోయిన్ గా ప్రియా ఆనంద్ ను తీసుకోవడం జరిగింది. తమిళ రీమేక్ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి విడుదలకు సిద్దం అంటున్నారు. ఈ సమయంలోనే మలయాళ రీమేక్ ప్రకటన వచ్చింది. మలయాళ స్టార్ నటుడు పృథ్వీ రాజ్ సుకుమార్ ప్రథాన పాత్రలో అంధాదున్ అక్కడ రీమేక్ చేసేందుకు పనులు మొదలు పెట్టారని మీడియా ద్వారా వెళ్లడయ్యింది.

తెలుగు లో మంచి రెస్పాన్స్ ను మాస్ట్రో దక్కించుకున్న కారణంగా మలయాళం మరియు తమిళ రీమేక్ ల పనులు స్పీడ్ అందుకున్నాయని అంటున్నారు. మలయాళ రీమేక్ లో తమన్నా పోషించిన పాత్రను మమత మోహన్ దాస్ పోషిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఉన్ని ముకుందన్ ఈ రీమేక్ లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి మాస్ట్రో మలయాళ వర్షన్ కూడా రెడీ అవుతోంది. హిందీ మరియు తెలుగు ప్రేక్షకులను ఇప్పటికే అలరించిన మాస్ట్రో మరింత మందికి చేరువ అవ్వడంతో పాటు అక్కడ కూడా తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈమద్య కాలంలో రీమేక్ లకు మంచి ఆధరణ ఉంటుంది. కనుక ఈ రెండు రీమేక్ లు కూడా ఖచ్చితంగా ప్రేక్షకుల ఆధరాభిమానంను దక్కించుకోవడం ఖాయం అంటున్నారు.